Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

డబ్బు విలువ నేర్పించండి

Parentsడబ్బు విలువ గురించి పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు తల్లిదండ్రులే రోల్‌మోడల్స్. ఆర్థిక సంబంధమైన విషయాలు వారికి కచ్చితంగా తెలియజేయాలి. ఈ మధ్య తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వడం గొప్పగా ఫీలవుతున్నారు. వాళ్లు అడిగినవి వారికి నిజంగాఅవసరమా లేదా…తమ తాహతుకు మించి అడుగుతున్నారా ..అనేది ఆలోచించాలి. చిన్నప్పటి నుంచే డబ్బు విలువ, ఎలా సంపాదిస్తున్నాం, ఎలా ఖర్చుపెట్టాలి అనేది తెలిపితే…పెద్దయ్యాక వారికెంతో ఉపయోగపడుతుంది.
# డబ్బు ఆదా చేయడం కూడా నేర్పించాలి. ఏదైనా వస్తువు కొనేముందు ఆలోచించమనాలి.
# మార్కెట్‌కు వెళ్లేటపుడు పిల్లల్ని కూడా వెంటబెట్టుకుని పోవాలి. ఏమేం కొనాలి, ఎంత బడ్జెట్ ఉంది అలాంటి విషయాలపై వారికి అవగాహన కల్పించాలి
# చూసిన ప్రతిదీ కొనకుండా ఏది అవసరమో అనేది వాళ్లకు ఆలోచించాలా గైడెన్స్ ఇవ్వాలి.
# కొంత డబ్బును చారిటీలకు ఇవ్వడాన్ని చిన్నప్పటినుంచే నేర్పించాలి.
# అప్పుడప్పుడూ వాళ్లను అనాథాశ్రమాలకు తీసుకెళ్లడం వల్ల వారికి కష్టాలంటే ఏంటి అనేది తెలుస్తుంది. డబ్బుకు విలువ ఇవ్వడం తెలుసుకుంటారు.
# అప్పుడప్పుడూ వారికిచ్చే డబ్బును పొదుపు చేసుకోమని చెప్పాలి.

Comments

comments