Search
Saturday 22 September 2018
  • :
  • :

కూతురికి చిత్రహింసలు : తల్లిదండ్రులు అరెస్ట్

Child-Rape-Abuseజిన్నారం : కన్న తల్లిదండ్రులే నాలుగేళ్ల చిన్నారిని చిత్రహింసలు పెట్టిన అమానుష ఘటన మెదక్ జిల్లా జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని పోచమ్మ బస్తీలో నివాసం ఉంటున్న చక్రవర్తి, రాధిక దంపతులు నాలుగేళ్ల కుమార్తె ప్రియాంకను గత కొన్ని రోజులుగా చెప్పిన మాట వినడం లేదంటూ తీవ్రంగా కొట్టి, శరీరంపై కాల్చారు. విషయం గుర్తించిన కాలనీ వాసులు సోమవారం పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని చిన్నారిని పరిశీలించారు. శరీరమంతా గాయాలతో ఉన్న ప్రియాంకను సంగారెడ్డిలోని ఛైల్డ్ లైన్ సంస్థ డైరెక్టర్ ఎం.ఎస్. చంద్రకు పోలీసులు అప్పగించారు. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

comments