Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

త్వరలో నరేంద్ర మోడీ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా..?

PM-MODI-BIOPIC

హైదరాబాద్ : ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల జమానా నడుస్తుంది. గతేడాది విడులై బయోపిక్ చిత్రాలు ‘దంగల్’, ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరి’ ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలో మరికొన్ని బయోపిక్ చిత్రాలు కూడా బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర బయోపిక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందన్న వార్త కేవలం సినీ అభిమానులకే కాదు… రాజకీయ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఆ బయోపిక్ మరెవరిదో కాదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీది.

గుజరాత్‌కు చెందిన మితేష్ కుమార్ పటేల్ అనే ఎన్‌ఆర్‌ఐ మోడీ జీవిత చరిత్ర మీద బయోపిక్ నిర్మించాలని అనుకున్నారట.. ఓ సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన మోడీ.. ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారత ప్రధాన మంత్రి ఎలా ఎదిగారు అనే అంశాల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.

Paresh-Rawal

కాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు పరీష్ రావల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎప్పటి నుంచో రావల్, ప్రధాని మోడీ మంచి మిత్రులన్న విషయం అందరికీ తెలిసిందే. గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా రావల్ మోడీ కోసం ప్రచారం చేశారు. ఈ మేరకు చిత్ర బృందం మోడీ పాత్ర కోసం రావల్‌ను సంప్రదించగానే… ఆయన వెంటనే ఓకే చెప్పేశారట.. ఈ చిత్రంలో వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ విషయంపై త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువడించనున్నారు.

Comments

comments