Home సూర్యాపేట సోషల్ మీడియాతో పరేషాన్

సోషల్ మీడియాతో పరేషాన్

police

మనతెలంగాణ/సూర్యాపేట : పగలనక గంటల కొద్దీ సోషల్ మీడియా లో తీవ్ర ప్రభావాన్ని చూపుతూ మానవ సం బంధాలకు దూరమవుతున్న నేటి సమాజాన్ని చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదని జిల్లాలోని కొందరి అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీవన విధానానికి సోషల్ మీడియా వరమా ? శాపమా ? అనే ప్రశ్నకు బహుశా సరైన సమాధానాన్ని ఎవరూ చెప్పలేరేమో ? సోషల్ మీడియా అతి వినియోగంతో పాటు ఆరోగ్యానికి ఎంతో హానికరమని శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో వెల్లడైనప్పటికీ సోషల్ మీడియాను అతిగా వాడే వెన్నులో జంకు పుట్టలేక పోతుంది. దీనికి తోడు అనవసరమైన, శిక్షార్హమైన పదాలు, అసభ్యకరమైన చిత్రాలతో అవతలి వ్యక్తులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాను అతిగా ఉపయోగించే వారిలో సుమారు 60% మంది జిల్లాలో ఉన్నారన డంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదే వరాయలు కొనియాడిన సుందరమైన తెలుగు భాషను ఆంగ్లం , బూతు పదాలతో సోషల్ మీడియా కంపు కొడుతున్న వైనాన్ని నేడు మన కళ్లకు అద్దినట్లుగా కనిపి స్తుం ది. కొంతమంది అత్యుత్సా హాన్ని ప్రదర్శిస్తూ చిన్న, పెద్ద , లింగ బేధాలతో సంబంధాలు లే కుండా అసభ్యకరమైన మెసేజ్‌లు, చిత్రాలను ఇతరులకు పంపి స్తుం డ డంతో చివరకు కటక టాల పాలయ్యే సమ యం ఆసన్నమైంది. ఇం దులో భాగం గానే సిఎం కేసిఆర్‌పై చేస్తున్న అసత్య ప్రచారాలు, అసభ్య పదజాలంతో సోషల్ మీడి యాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్ర విద్యు త్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డిని అప్రతిష్ట పాలు చేసే విష యంగా కొందరు బిజెపి నాయకులు సోషల్ మీడి యాలో పోస్ట్ చేసి అరెస్ట్ అయిన విషయం విదిత మే. అలాగే అశ్లీల చిత్రాలను ఇతరులకు పంపు తూ గరిడేపల్లి మండ లంలో ఒక యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా కొంతమందిని మంద లించడంతో అట్టి యువకుల్లో కొంత మార్పు కనబడుతున్నదని అనిపిస్తోంది.
సోషల్ మీడియాను అతిగా వినియోగిస్తున్న యువత
జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాను అతిగా వినియోగిస్తున్న వారిలో యువతీ యు వకులే అధికమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రాశ్చాత్య దేశాల్లో సుమారు 48% మంది టాబ్‌లెట్, లాప్‌ట్యాప్ వంటి గాడ్జెట్‌లను ఉపయోగిస్తున్న క్రమాన్ని క్రమక్ర మంగా దేశంతో పాటు రాష్ట్రం, జిల్లాలో ఎక్కువ ప్రభావాన్ని చూపిందని తెలు స్తోం ది. దీని ఉపయోగంలో యువతీ, యువకులే అధికంగా ఉంటారని భావిస్తున్నారు.
మీడియా వాడకంలో ఎన్నో అనర్థాలు
సోషల్ మీడియాను అతిగా వాడేవారు కొన్ని అనర్థాలకు గురి కానున్నారు. ఉపయో గం ఉన్నవి, లేని పోస్టింగ్‌లతో ఇతరుల మానసిక సామర్థాన్ని పరీక్షించడంతో పా టు తమ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే రాత్రి వేళల్లో సోషల్ మీడి యాను అతిగా వాడటంతో సరిగా నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుంది. దీంతో ముఖ్యంగా యువత మీడియాకు దగ్గరై భవిష్యత్తును చూపే పుస్తకాలకు దూరం అవుతుంది.
సోషల్ మీడియాలో కంటతడి పెట్టించిన సందేశం
సుమారు గత వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన సందేశం సోషల్‌మీడియాను ఉపయోగించే వారిని కంటతడి పెట్టించింది. తమ కుమారుడు ఓ ప్రశ్నకు రాసిన సమాధాన పత్రంలో పదాల కలయిక ఇది. తాను తన తల్లిదండ్రు ల కు కుమారుడిగా కాకుండా స్మార్ట్‌ఫోన్‌గా పుడితే ప్రేమగా చూసుకుంటారనే సందే శం చూస్తే ఎవరైనా కన్నీరు కార్చక తప్పదేమో. ఎలాగంటే తాను పిలిచినా, మాట్లాడినా సమాధానం ఇవ్వని తన తల్లిదండ్రులు ఒక్క రింగ్‌కే ఫోన్ ఎత్తి సమాధానం ఇస్తారు. వచ్చిన ఎస్‌ఎంఎస్‌లకు రిప్లై ఇచ్చుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందు తారు కాని తనతో కాలాన్ని గడపలేకపోతున్నారనే ఆవేదనతో ఆ సందేశం ఇచ్చిన వాట్సప్, ఎస్‌ఎంఎస్ పలువురిని ఆలోచింపజేసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇతరుల వ్యక్తిత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే కఠిన చర్యలే
-ప్రకాష్‌జాదవ్, జిల్లా ఎస్పి, సూర్యాపేట
అధికారంలో ఉన్న ,ప్రతి పక్షం లో ఉన్న ప్రజాప్రతి నిధు లు, అధికారులు, అనధి కారు లు , యువతీ యువకు లపై అసభ్య పదజాలంతో గాని వారి ప్రతి ష్టను కించ పరిచే విధంగా గా ని సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేసే ఎంతటి వారిపైనాన చట్ట పరమైన చర్య లు తప్పవు. ప్రతి ఒక్కరి వాట్సప్, ఫేస్‌బుక్‌లపై నిఘా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోనుంది. సోషల్ మీడియా వాడే వ్యక్తులు జాగ్రత్తగా సంయ మనం పాటించాలి.