Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

‘గీతాంజలి’ని గుర్తుకుతెచ్చిన ‘పరిచయం’ టీజర్

nn

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై హైదరాబాద్ నవాబ్స్ మూవీ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పరిచయం’. విరాట్ కొండూరి హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సిమ్రత్ కౌర్ హీరోయిన్. ఈ చిత్రం టీజర్, ఫస్ట్‌లుక్‌ని నాని విడుదల చేశారు.  ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ “ఈ చిత్రం టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. దీన్ని చూస్తుంటే మణిరత్నం ‘గీతాంజలి’ మూవీ గుర్తుకువస్తోంది. హీరోహీరోయిన్‌లు ఈ కథకు సరిగ్గా సరిపోయారు. ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర నిర్మాత రియాజ్ మాట్లాడుతూ “షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని చెప్పారు. దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ “నాని మా సినిమా టీజర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి”అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః నరేష్ రానా, మ్యూజిక్‌ః శేఖర్‌చంద్ర, పాటలుః భాస్కరభట్ల, వనమాలి, శ్రీమణి, డైలాగ్స్‌ః సాగర్, ఫైట్స్‌ః రామకృష్ణ.

Comments

comments