Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వివాదాల స్వామికి నగర వెలి

ps

హైదరాబాద్ నుంచి  ఆరు నెలల బహిష్కరణ

పోలీసు కమిషనర్ ఉత్తర్వులు, కాకినాడకు తరలింపు
హైకోర్టులో పరిపూర్ణానంద పిటిషన్, నేడు విచారణ

మన తెలంగాణ/ హైదరాబాద్: పరిపూర్ణానం ద స్వామిపై ఆరు నెలల నగర బహిష్కరణ వేటు వేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బుధవారం తెల్లవారు జామున ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే బం జారాహిల్స్ ఎసిపి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు పరిపూర్ణానంద స్వామి ఇంట్లోకి చొరబడి ఉత్తర్వుల కాపీ అందించారు. అనంత రం ప్రత్యేక వాహనంలో స్వామిని పోలీసులు కాకినాడకు తీసుకెళ్లి వదిలి వచ్చారు. రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై రెండు రోజుల క్రితమే నగర బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. కాగా పరిపూర్ణానం ద స్వామిని హైదరాబాద్ నగరం నుంచి ఎం దుకు బహిష్కరించాల్సి వచ్చిందో వివరిస్తూ పోలీసులు మీడియాకు సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, వాటిపై తమ విచారణలో తేలిన వివరాలను వెల్లడించారు. 2017 నవంబర్ 1న మెదక్ జిల్లా రాష్ట్రీయ హిందూ సేన అవిర్భావ సభలో మాట్లాడిన స్వామీజీ, ముస్లింలకు, క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు డబ్బిస్తున్న ప్రభుత్వాలు ప్రజాధనాన్ని సబ్సిడీలుగా మారుస్తున్నాయని, హిందువులకు మాత్రం పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు డబ్బివ్వకుండా, సర్ చార్జీలను పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపించారని, తమ విచారణలో ఇవి అభ్యంతరకర వ్యాఖ్యలని తేలిందని తెలిపారు. ఆపై 2017 డిసెంబర్ 2న కామారెడ్డి జిల్లాలో మాట్లాడుతూ. “మీకు నిజాం పాలన కావాల..?లేక ఛత్రపతి శివాజీ పాలన కావాలా..?” అంటూ యువతను ప్రశ్నించారని, అదే సమయంలో బాబర్, గజనీ మహమ్మద్, ఖిల్జీ, హుమాయున్ తదితరుల పేర్లు చెబుతూ, వారు హిందువులపై అరాచకాలు చేశారని, అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, హిందువులను హత్యలు చేశారని మాట్లాడుతూ, యువతలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఇంటి కూడా అభ్యంతరకరమేనని అన్నారు. మరోసారి ఆమన మాట్లాడుతూ. రజాకార్లను ప్రస్తావించి, హిందు మహిళలపై వారు దమనకాండ సాగించారని అన్నారని, నిజామాబాద్ పేరును ఇందూరుగా పేరు మార్చాలని డిమాండ్ చేశారని, హైదరాబాద్, సికింద్రాబాద్, అదిలాబాద్, మహబూబ్‌నగర్‌ల పేర్లు మార్చాలని వ్యాఖ్యానించారని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మార్చిలో కరీంనగర్‌లో మా ట్లాడిన ఆయన పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా, తెలంగాణ ప్రివెంటేషన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హాజర్డస్ యాక్టివిటీస్ యాక్ట్-1980 చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం షోకాజ్ నోటీసులు ఈ నెల 9వ తేదీన స్వామీజికి ఇచ్చామని చెప్పారు. తాము నోటీసులు ఇచ్చినా, ఆయన్నుంచి సమాధానం రాకపోవడంతోనే ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరంలోకి రా కుండా నిషేధం విధించామని బంజారాహిల్స్ ఎసిపి సంతకంతో ఉన్న ఈ ప్రకటనలో ఉంది. ఇక ఆరు నెలల తరువాత ఆయన హైదరాబాద్‌కు రావాలంటే తమ అనుమతి తీసుకోవాలని, ఎక్కడ ఉంటారన్న విషయంతో పాటు ఎంత కాలం ఉంటారన్న విషయాన్ని చెప్పాలని ఆదేశించినట్లు పోలీసులు వెల్లడించారు. తమ నగర బహిష్కరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన రెండు వారాల్లోగా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని అన్నారు.ఎసిపి ఆదేశల మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు తెల్లవారు జామున స్వామిజీ నివాసంలోకి చొరబడిన పోలీసులు ఎక్స్‌టెర్నమెంట్ ఆర్డర్ చేతిలో పెట్టి అదుపులోకి తీసుకుని కాకినాడకు తరలించారు.ఇదిలావుండగా పరిపూర్ణానంద స్వామిపై పోలీసులు వేసిన బహిష్కరణ వేటును కత్తి మహేష్ ఖండిచడం గమనార్హం.
న్యాయం ధర్మం నాకు రెండు కళ్లు: స్వామి పరిపూర్ణానంద
న్యాయం అడిగితే తనను బహిష్కరణ వేటు వేశారని..దీనిపై ఎవరు ఆవేశాలకు లోనుకావ్వొద్దని స్వామి పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఉండాలని, రామనామ జపాన్ని కొనసాగించాలని కోరారు. ఎప్పటికైనా గెలిచేది న్యాయం, ధర్మమేనని అన్నారు. హిందూ ధర్మంపై హిందువుల మనోభాలాలతో ఆటలు ఆడుకుంటున్న వారికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారన్నారు. హిందూ ధర్మంపై దాడులు చేసే జాతి వ్యతిరేక శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని స్మామీజి చెప్పారు.
హైకోర్టులో పిటిషన్ : తెలంగాణ పోలీసు శాఖ తనను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ పరిపూర్ణానందస్వామి బుధవారం హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీసు శాఖ విస్మరిస్తుందని పిటిషన్‌లో స్వామి పేర్కొన్నారు. తన బహిష్కరణను వెటనే తొలగించేలా తెలంగాణ పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరుగనున్నాయి.

Comments

comments