Home అంతర్జాతీయ వార్తలు పారిస్ ఒప్పందం ఘనత అమెరికాదే : ఒబామా

పారిస్ ఒప్పందం ఘనత అమెరికాదే : ఒబామా

Obamaవాషింగ్టన్: పారిస్‌లో కీలక వాతావరణ ఒప్పందం ఖరారుకు చైనా, ఇండియాలను ఒప్పించేందుకు తమ దేశం వహించిన నాయకత్వ లక్షణాలు కీలకంగా నిలిచాయని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా చెప్పారు. ఏడాది ము గింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఒబామా మాట్లాడుతూ, చర్చలలో పాత్ర వ హించిన తమ దేశ సంబంధిత నాయకులకు అభినందనలు తెలిపారు. వాతావరణ చర్చలలో 200 దేశాలు పాల్గొ న్నాయని, అందరినీ ఒకేతాటికి తీసుకురావడం, చారిత్రక ఒప్పందం కుదరడానికి చొరవ తీసుకోవడం ప్రత్యేకించి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్న భారత్, చైనాలు ఈ దిశలో కలిసి వచ్చేలా చేయడం ప్రధానమైన విషయమని ఒబామా అన్నారు. సంయుక్త ప్రకటన ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెలువడటానికి అమెరికా అన్ని విధాలుగా యత్నించిందని ఇండియాను, బ్రెజిల్‌ను ఒప్పించడం కీలక అంశం అని, దీనితోనే పారిస్ ఇంతకు ముందు జరిగిన కోపెన్‌హాగన్ సదస్సులాగా విఫలం కాలేదని వివరించారు. అమెరికా ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలు మరోమారు వెల్లడి అయ్యాయని, ఇరాన్‌ను అంతర్జాతీయ షరతుల పరిధిలోకి తీసుకురావ డం, ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం, ఎబోలా వైరస్ నిర్మూలన చర్యలు వంటివి గడిచిపోతున్న ఏడాదిలో చోటుచేసుకున్న కీలక పరిణామాలని క్యూబాతో సత్సంబంధాలు నెలకొనడం వంటివి ముఖ్యమైనవని అన్నారు.