Home అంతర్జాతీయ వార్తలు పారిస్ సూసైడ్ బాంబర్ … ఇన్ని నెలలూ సొంతింట్లోనే మకాం

పారిస్ సూసైడ్ బాంబర్ … ఇన్ని నెలలూ సొంతింట్లోనే మకాం

పేల్చివేసుకోవాలనే యత్నం చివరిక్షణాలలో విరమణ
Salah1బ్రజెస్ (బెల్జియం) : పారిస్‌లో ఈఫిల్ టవర్ సాక్షి గా ఐఎస్‌ఐఎస్ సాగించిన నరమేథపు ప్రధాన సూత్రధారి నాలుగు నెలలుగా బెల్జియంలోని తన సొంత ఇంట్లోనే తలదాచుకున్నట్లు వెల్ల డైంది. ఉగ్రవాద విధ్వంసకాండ పుటలలో దారు ణ స్థాయి ఘటనగా మారిన పారిస్ దాడులకు పాల్పడి అరెస ్టయిన ఈ ఉగ్రవాది సలా హ్ అబ్దెస్లామ్ తాను సూసైడ్ బాంబర్‌ను అని వెల్ల డించుకున్నారు.దాడుల సమయంలో చివరిక్షణాల లో తనను తాను పేల్చకోవాల నుకున్నానని, సూసైడ్ బాంబర్‌గా తన కర్తవ్యం నిర్వర్తించాలను కున్నానని అయితేచివరి దశలో ఆప్ర యత్నం నుంచి విరమించుకు న్నానని సలాహ్ తెలిపారు. చాలా నెలలుగా తప్పించు కుతిరుగుతున్న ఆయనను రెండు రోజుల క్రితమే బెల్జి యంలో అరెస్టు చేశారు. నాలు గు నెలల నుంచి ఆయన కోసం సాగినట్లు బెల్జియం అధికా రులు తెలిపారు. పారిస్‌లో జరిగిన దాడులలో సుమారు 130 మంది బలి అయ్యారు. తాను సూసైడ్ బాంబర్‌ను కాబట్టి విధిగా బాంబు దాడుల తరువాత ఆత్మాహుతికి పాల్పడా లను కున్నట్లు తెలిపారు. తన అన్న బ్రహీంను కూడా సూసైడ్ బాంబర్‌గా వాడినట్లు తెలిపారు. పారిస్ దాడుల సూత్ర ధారిని ఇప్పుడు బెల్జియంలోని బ్రూగ్స్ జైలుకు తరలించారు. అంతకు ముందు బ్రస్సెల్స్ అధికా రులు ఆయన ను కొద్ది సేపు విచారించారు. దాడిరోజు తాము చేపట్టిన వ్యూహాల గురించి సలాహ్ వివరించినట్లు వెల్లడైంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోన్న పారిస్ అంతర్జాతీయ స్టేడి యం, రాక్ బ్యాండ్ ప్రదర్శన స్థలి, బాతా క్లాస్ థియే టర్ల వద్ద పేలుళ్లు పలు కెఫేలపై విచక్షణారహితంగా తూటాల వర్షం కురి పించడంతో అప్పటివరకూ ప్రశాం తంగా ఉన్న పారిస్ గుండె నెత్తుటి చెరువు అయిం ది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వరస బాంబు పేలుళ్ల ఘటనపై నిరసనలు వ్యక్తం అయ్యా యి. ప్రధాన సూత్రధారి సలాహ్‌ను పట్టుకో వడానికి అనేక విధాలుగా యత్నిం చారు. చివరికి బెల్జి యం రాజధాని బ్రసెల్స్‌లోని మోలా స్‌బీక్ ప్రాంతం లో పట్టుకున్నారు. ఉగ్రవాద నిరోధక దళాలు జరిపిన దాడులలో కొద్దిగా ప్రతిఘటిం చిన సందర్భంగా సలాహ్ స్వల్పంగా గాయపడ్డట్లు తెలి సింది. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతంలోనే పోలీసులు ఆయనను పట్టుకోవడం విశేషం. అబ్దెస్లామ్ వేలిముద్రలు ఇటీవలి కాలంలో ఇక్కడ దొరికినట్లు వెల్లడి కావడంతో విచారణాధికారుల నుంచి అందిన సమాచారం మేరకు బ్రసెల్స్ అటవీ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహి ంచారు. మోలా స్‌బీక్‌లో నిఘా ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో ఎదురు కాల్పు లు జరిగాయి. ఆటోమోటిక్ ఆయుధాలతో ఉగ్రవాదులు దాడికి దిగే యత్నాలకు పాల్పడిన సాయుధ పోలీసులు వారిని తిప్పికొట్టారు. పారిస్ దాడుల తరువాత మోలా స్‌బీక్‌కు చేరిన ఉగ్రవాది తన ఇంట్లోనే తలదాచుకున్నట్లు వెల్లడైంది. ప్రపంచ అత్యంత భయంకర ఉగ్రవాద దాడులలో కీలక సూత్రధా రి నాలుగు నెలల వరకూ స్థానిక మేయర్‌ఆఫీసుకు అతి సమీ పంలోని సొంత ఇంట్లో ఉన్నట్లు వెల్లడైంది. 26 సంవత్సరాల సలాహ్ ఫ్రెంచ్ జాతీయు డు. అయితే బ్రస్సెల్స్‌లో జన్మించాడు. ఇటీ వలే ఆయన చేతివేలి ముద్రలు సదర్న్ బ్రసెల్స్‌లోని అటవీ ప్రాంతంలో దొరికాయి. చాలా నెలలు గా యూరప్ దేశాలు అన్నీ ఈ ఉగ్రవాదిని మోస్టెవాంటెడ్‌గా ప్రకటించా యి.కొద్ది సేపు విచారణా ధికారులు అన్ని అంశాలను ఆరా తీసిన తరువాత అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య బ్రజెస్ నగర శివార్ల లోని వాయవ్య జైలుకు తరలించారు. అక్కడ ఆయనను ప్రత్యేక విభాగంలో ఉంచారు. ప్రస్తుతం ఆయన విచార ణా ధికారులకు సహక రిస్తున్నట్లు తెలిసింది. అయితే విచారణకు ఆయనను పారి స్‌కు తరలించే యత్నాలను తాము చట్టపరంగా అడ్డుకు ంటా మని ఆయన తరఫున లాయర్ స్వెన్ మేరీ తెలిపారు. పోలీసులు ప్రస్తుతం సలాహ్ సహచరుడిగా భావిస్తున్న మౌనిర్ అహ్మద్ అలాజ్‌ను కూడా నిర్బంధంలోకి తీసుకు న్నారు. పారిస్ దాడులకు తాము బాధ్యులమని ఐసిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. సలాహ్ సోదరుడు పారిస్‌లోనే దా డుల సమయంలో ఓ రెస్టారెంట్‌లో తనను తాను పేల్చు కుని చనిపోయినట్లు ఇప్పుడు మరోమారు నిర్థారణ అ యింది. ఉగ్రవాద దాడులు సాగించిన ప్రధా న సూత్ర ధారి నుంచి వెలువడ్డ తొలి వాంగ్మూలం, ఈ దాడుల విచారణలలో కీలకమైన అంశంగా మారినం దున పారి స్‌లోని విచారణ సంస్థలు కూడా దీనికి సబం ధించి అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తు న్నాయి. దాడు లకు సంబంధించిన పారిస్ విచారణాధికారి ఫ్రాంకొ యిస్ మోలిన్స్ ఇప్పటి పరిణామంపై స్పందించారు. ప లు అంశాలు ఇక ముందు వెలుగులోకి వస్తాయని భా విస్తున్నట్లు పారిస్‌లో విలేకరులతో చెప్పారు. అబ్దెస్లా మ్ సలాహ్ పారిస్ దాడులలో కీలకంగా మారడ నడానికి పారి స్‌లో ఓ చోటదాడుల తరువాత కొద్ది రోజులకు మందు పాతరలతో కూడిన ఆత్మాహుతి జాకెట్ లభించ డం కీలక ఆధారంగా మారింది.
ఫ్రాన్స్‌కు తీసుకువచ్చేలా చేస్తాం : హోలాండే
పారిస్ దాడుల సూత్రధారి దొరికిన ఘటనపై ఫ్రాన్స్ అధ్య క్షులు ఫ్రాంకొయిస్ హోలాండే స్పందించారు. శుక్ర వారం ఉగ్రవాది అరెస్టు అయిన విషయం తెలిసిందని, దేశంలో ఈ ఉగ్రవాదిని తగు విధంగా విచారించాల్సి ఉందని , ఆయ న ను పారిస్‌కు బెల్జియం అధికారులు తర లించేలా తగు విధ ంగా దౌత్యపరమైన చర్యలు తీసుకుంటామని , సాధ్య మైన ంత త్వరగా ఈ దిశలో చర్యలు ఫలించేలా చేస్తామని విలేకరులకు తెలిపారు. ఓ ఫ్రెంచ్ జాతీయుడే నేరుగా ఇక్కడ జరిగిన దాడులకు కీలక బాధ్యుడు కావడం అనేది అత్యంత బాధాకరం అని తెలిపారు. దాడులకు పాల్పడిన సంస్థకు కీలక పాత్రధా రిగా మారడం, దాడులకు అన్ని విధాలుగా సూత్రధారి కావడం శోచనీయం అని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షులు యూరోపియన్ యూనియన్ సమావేశాల కోసం బ్రసెల్స్‌లో ఉన్నప్పుడే ఈ ఉగ్రవాదిపై దాడి జరిగి అరెస్టు కావడం జరిగింది. బెల్జియం నుంచి ఈ ఉగ్రవాదిని విచారణకు పారిస్‌కు తరలించడంలో అడ్డంకులు ఏమీ ఉండకపోవచ్చునని అయితే వెనువెంటనే ఈ ప్రక్రియ జరగకపోవచ్చునని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.