Home అంతర్జాతీయ వార్తలు ప్రోబ్ ప్రయోగం నేటికి వాయిదా

ప్రోబ్ ప్రయోగం నేటికి వాయిదా

సాంకేతిక లోపంతో చివరి క్షణంలో నిలిపివేసిన నాసా

NASA

వాషింగ్టన్ : సూర్యునిపై పరిశోధనలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమెరికా పరిశోధన సంస్థ నాసా చేపట్టదలచిన ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. మానవరహిత పార్కర్ సోలార్ ప్రోబ్ శనివారంనాడు కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్తుందనగా ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న కీలక అధికారి పెద్ద పెట్టున ‘హోల్డ్.. హోల్డ్.. హోల్డ్’ అని అరుస్తూ ప్రయోగాన్ని నిలిపివేయించారు. నాసా శాస్త్రవేత్తలతో పాటు యావత్ ప్రపంచం ఉత్కంఠగా భరితంగా ఎదురుచూస్తుండగా సరిగ్గా ప్రయోగానికి మరో నిమిషం 55సెకన్లు మిగిలి ఉండగా ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

అన్నీ అనుకూలిస్తే తిరిగి ఆదివారంనాడు పార్కర్ సోలార్ ప్రోబ్‌ను తిరిగి ప్రయోగించాలని నిర్ణయించారు. ఆదివారం భారతీయ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 101కు ఇది జరగనుంది. వాయుభరిత హీలియం ఒత్తిడి వల్లే ప్రయో గం వాయిదాకు కారణమైనట్లు వెల్లడైంది. కారుసైజులో ఉండే ఈ ప్రోబ్ 1.5 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి డెల్టా 4 హెవీ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగిస్తారు. డెల్టా 4హెవీ చాలా పెద్ద ప్రయోగ నౌక. 72మీటర్ల ఎత్తు, 733,000 కిలోగ్రాముల బరువుతో ఉంటుంది. అపోలో11,శాటర్న్ 5, వ్యోమ నౌకలతో పోల్చి చూస్తే అవి 3,000,000 కిలో గ్రాముల బరువు ఉన్నది.

సూర్యునికి అత్యంత చేరువైన వ్యోమనౌక ఇప్పటివరకు చరిత్రలో ఏదీ లేదు. సూర్యవలయం (కరోనా)లోని రహస్యాలను, సూర్యుని చుట్టూ అవరించిన అసాధారణ వాతావరణాన్ని పరిశోధించడమే పార్కర్ ప్రోబ్ లక్షం. సౌర వాయువు ఎక్కడ వేగం పెంచుకుని విజృంభిస్తుంటుందో అక్కడకు తాము వెళ్తుండడం ఉత్కంఠభరితంగా ఉందని నాసా ప్లానెటరీ సైన్స్ డివిజన్ డైరెక్టర్ జిమ్‌గ్రీన్ చెప్పారు.

మా మీదుగా ఎక్కడ భారీ అయస్కాంత క్షేత్రాలు వెళ్తుంటాయో, సూర్యవలయ ద్రవ్యరాశి వెల్లువ సౌరవ్యవస్థలోని ఎక్కడైతే ప్రవేశిస్తాయో అవన్నీ తమకు అనుభవం అవుతాయని అన్నారు. సూర్యుని ఉపరితలం కన్నా సూర్యవలయం(కరోనా) 300 రెట్లు వేడిగా ఉండడమే కాక, శక్తివంతమైన ప్లాస్మాను, రేణువులను వెదజల్లుతుంది. దీనివల్ల భూమ్యాకర్షణ అంతరిక్ష తుపానులు, భూమిపై పవర్‌గ్రిడ్ విచ్ఛిన్నమై విపరీతాలు ఏర్పడతాయి.

ఇటువంటి సౌర వెల్లువలు గురించి తెలుసుకున్నది ఏమీ లేదు. సౌర వాయువుల్లో గందరగోళం ఏర్పడి ఎప్పుడు భూమిని తాకుతుందో ముందుగా తెలుసుకోవడానికి పార్కర్ సోలార్ ప్రోబ్ తమకు సహకరిస్తుందని ప్రాజెక్టు సైంటిస్టు జస్టిస్ కస్పర్ చెప్పారు. సౌర వాయువులు, అంతరిక్ష తుపాన్ల గురించి బాగా తెలుసుకుంటే ము న్ముందు చంద్ర, అంగారక పరిశోధనల యాత్రలో బయలుదేరు వ్యోమగాములకు కూడా ఉపయోగమవుతుందని అన్నారు. ఇప్పుడు ప్రోబ్‌కు 11.43 సెంటీమీటర్ల మందంతో అల్ట్రా పవర్‌ఫుల్ హీట్ షీల్డును రక్షణగా అమర్చారు.

ప్రోబ్‌లో అత్యంత శక్తివంతమైన రేణువులను, సౌరజ్వాలలను, సూర్యవలయ(కరోనల్) ద్రవ్యరాశి వెల్లువను, సూర్యుని చుట్టూ మారుతుండే అయస్కాంత క్షేత్రాన్ని వీటన్నిటినీ కొలిచే సాధనాలు ఉన్నాయి. సూర్యుని ముందు వాతావరణాన్ని దృశ్యాలుగా చిత్రీకరించే ఇమేజర్ కూడా ఉంది.పోబ్ ఎప్పుడైతే సూర్యునికి చేరువ అవుతుందో అప్పుడు గంటకు 430000 మైళ్ల వేగంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. అంటే న్యూయార్కు నుంచి టోక్యోకు ఒక నిమిషంలో వెళ్లగలిగేటంత స్పీడు అని అంచనా వేయవచ్చు.

సౌర వ్యవస్థకు బాహ్య సరిహద్దు

 ‘హైడ్రోజన్ వాల్’గా నామకరణం, న్యూ హారిజన్స్ వ్యోమనౌక డేటా ఆధారంగా నాసా నివేదిక

నాసా శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థకు పొలిమేర హద్దును కనుగొనగలిగారు. ఇది వరకు దీని గురించి సరిగ్గా వివరణ రాలేదని భావిస్తున్నారు. అగోచరంగా ఉన్న ఈ సరిహద్దును తమ న్యూ హారిజన్స్ వ్యోమనౌక చూడగలదని చెప్పారు. దీనికి ‘హైడ్రోజన్ వేవ్’గా పేరు పెట్టారు. ఇది మన సౌరవ్యవస్థ అంచున ఉందని, సౌర వాయువు, బుడగలు ఈ సరిహద్దు వద్ద ఆగిపోతాయని నక్షత్రాల మధ్య ఉన్న ద్రవ్యరాశి ఇక్కడ చాలా చిన్నదిగా ఉన్నా అందులోంచి సౌర వాయువులు వెళ్లలేనం త బలంగా ఉంటుందని, అదే సమయంలో సౌర వా యువు ద్వారా వెళ్లేటంత బలంగా ఉండదు. ఇదొక గోడలా ఆ వాయువులను లోపలనే అణచివేస్తుంది. సూర్యుడు ద్రవ్యరాశిని, శక్తిని సౌరవాయువలు రూ పంలో బయటకు పంపిస్తుంటాడు. అవి ఫ్లూటో కక్ష దాటి ప్రయాణిస్తాయి. ఇప్పటి వరకు సౌర వాయువులు ప్లూటో అవతల మన పాలపుంతల పరిధిలో పాలపుంతల శక్తితో విలీనం అవుతాయని శాస్త్రవేత్తలు నమ్మేవారు.

కొత్త ఆదారం ప్రకారం సౌర వాయువులు తీసుకొచ్చి ద్రవ్యరాశి, శక్తి ఒక రీజియన్‌లో పేరుకుపోయి ‘హైడ్రోజన్ వాల్‌” నిర్మాణంలో పాలుపంచుకుంటాయని గుర్తించమైంది.ఎక్కడైతే సౌర పదార్థం నక్షత్ర మండల అంతర పదార్థంతో నిర్మాణం రూపొందుతుందో అదే హైడ్రోజన్ వాల్‌గా తయరావుతుంది. అంతరిక్షంలో హైడ్రోజన్ చాలా సాధారణ పదా ర్థం. సూర్యుడు పూర్తిగా ఈ వాయువుతోనే నిండి ఉన్నాడు. ఇది మండి శక్తిని, హీలియంను ఇస్తుంది. న్యూ హారిజన్స్ పంపిన డేటా ప్రకారం సౌర వ్యవస్థ సరిహద్దు కచ్చితంగా హైడ్రోజలోనే నిర్మితమైందని నాసా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఏదెలాగున్నా ఈ పరిశోధన చివరిది కాకపోచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. న్యూ హారిజన్స్ వాస్తవానికి అతినీలలోహిత కిరణాలను కనుగొన్నది తప్ప ‘హైడ్రోజన్ వాల్’ను కాదని వారు నమ్ముతున్నారు. న్యూహారిజన్స్‌ను 2006 జనవరిలో ప్రారం భించారు. 2015లో ఇది ప్లూటో సమీపానికి వేగంగా వెళ్లగలిగింది.
మన తెలంగాణ/సైన్స్ విభాగం