Home జాతీయ వార్తలు పార్లమెంట్ పాతబాటే

పార్లమెంట్ పాతబాటే

PARLIAMENT_HOUSE_manatelang copyన్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రతిష్ఠంభన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన ప్రతిపాదనలతో అఖిలపక్షం సమావేశం నిర్వహించని పక్షంలో మీటింగ్‌ను కాంగ్రెస్ బహిష్కరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వర్గాలు శనివారం ఈ విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించాయి. ‘ప్రభుత్వం అన్ని పార్టీలతో సమావేశం జరపనున్నట్లు తెలియ జేసింది. అయితే, వారి ఉద్దేశంపై స్పష్టత లేదు. పార్లమెంట్ సమావేశాల ప్రతిష్ఠంభన సమస్యను పరిష్కరించా లని మేం కూడా కోరుకుంటున్నాం’ అని సీనియర్ కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం సదుద్దేశంతో జరపా లని కోరుకుంటే మేం సమావేశానికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని శర్మ చెప్పారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరే కంగా గళం విప్పుతోన్న ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ శనివారం సాయంత్రం వరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రతిపాదనలను మాకు తెలియజేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీలు అనుసరిం చాల్సిన వ్యూహాన్ని రూపొందించుకోవడానికి ముందు కాంగ్రెస్ అధి నేత్రి సోనియాగాంధీ కూడా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావే శాన్ని సోమవారం ఉదయం నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశం జరగడం ఇదే తొలిసారి కానుంది. పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ పార్లమెంట్ ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపక్షాల వద్దకు స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలన్నదే కాంగ్రెస్ ముఖ్యోద్దేశం అన్నారు.