Search
Monday 24 September 2018
  • :
  • :

పార్లమెంట్ సమావేశాల్లో మరో అనూహ్య ఘటన

Parliament Monsoon Session 2018 in Rajya Sabha

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో సోమవారం మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసి వేయడంతో పాటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి లోక్ సభ కార్యక్రమాలు కొనసాగించినట్లుగానే సోమవారం రాజ్యసభలోనూ అదే సీన్ రిపీట్ అయింది. సభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయించి సభా కార్యక్రమాలను కొనసాగించారు. టిడిపి, వైసిపి సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ వెంకయ్య నాయుడు సుమారు అర్ధ గంట పాటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయించారు. ఇక లోక్ సభలో టిడిపి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధాని మోడీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇలా వరుస అనూహ్య ఘటనలతో ఈ సారి సమావేశాలు రక్తి కట్టిస్తున్నాయి.

Comments

comments