Home జాతీయ వార్తలు జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Parliament Monsoon Sessions Begins From July 18th

ఢిల్లీ : జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిపిఎ) సోమవారం భేటీ అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించారు. మొత్తం 18 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, ఇతర వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లులపై చర్చించే అవకాశం ఉంది.

Parliament Monsoon Sessions Begins From July 18th