Home తాజా వార్తలు లోక్ సభలో నామా… రాజ్య సభలో కెకె…

లోక్ సభలో నామా… రాజ్య సభలో కెకె…

Keshava Rao

హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో చర్చ జరిగింది. పార్లమెంటరీ పార్టీ నేత, లోక్ సభ, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపి కె.కేశవరావును ఎన్నుకున్నారు. లోక్ సభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష నాయకుడిగా ఎంపి కెకె ఎన్నుకున్నారు. లోక్,రాజ్య సభల్లో ఒక్కో డిప్యూటీ లీడర్, ఒక్కో విప్‌ను నియమించాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 

Parliamentary TRS Party Leader is K Keshava Rao