Search
Friday 21 September 2018
  • :
  • :

గిన్నిస్‌బుక్‌లోకెక్కిన చిలుక

Parrot

 

* సాధారణంగా పక్షుల కాళ్ళకి నాలుగు వేళ్ళల్లో మూడు ముందుకు, ఒకటి వెనక్కి వుంటుంది. కానీ రామచిలుకకి రెండు             వేళ్ళు ముందుకి, రెండు వేళ్లు వెనక్కి ఉంటాయి.
* దక్షిణ పసిఫిక్ దేశాల్లోని కొన్ని రామచిలుకలు మాంసాన్ని కూడా తింటాయి.
* సాధారణంగా రామచిలుకలు చిలకపచ్చ రంగులోనో, నాలుగైదు రంగులు కలిపి గానీ ఉంటాయి. ఆఫ్రికన్ రామచిలుకలు             బూడిద రంగులో ఉంటాయి.
* చిలుకలు వాటి ముక్కు చివరి నుండి రుచిని
తెలుసుకుంటాయి. * అతి పెద్ద రామచిలుక బరువు ఇండ్లల్లో తిరిగే పిల్లి బరువుకు సమానం.
* గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన రామచిలుక 1700 పదాలు మాట్లాడగలదు.
* రామచిలుకలు వాటి శరీరానికి ఉన్న ఈకలను శుభ్రం చేసుకోడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాయి.
* పక్షుల్లో రామచిలుక ఒక్కటే కాళ్ళతో ఆహారాన్ని పట్టుకుని, నోటి దగ్గరకు తీసుకెళ్ళేది.
* ప్రపంచంలోని అతి పెద్ద రామచిలుకని కకాపొ అంటారు. ఇది ఎగరలేదు.
* కొన్ని రకాల రామచిలుకలు పగలే కాదు, రాత్రిపూట కూడా చాలా హుషారుగా ఉంటాయి.
* మొత్తం 372 రకాల రామచిలుకలున్నాయి. చిలుకలు చాలా వరకు ఉష్ణమండలాల్లోనే జీవిస్తాయి.
* చిలుకలకు కాళ్ళు, పాదాలు బలంగా వుంటాయి. ముక్కు వంపు తిరిగి ఉంటుంది.
* తెలివిగల పక్షుల్లో రామ చిలుక ఒకటి.
* కొన్ని రకాల రామచిలుకలు మనుషుల గొంతుని అనుకరిస్తాయి.

* రామచిలుకల్లో కొన్ని జాతులు దాదాపు 80 సంవత్సరాలు బతికేవి కూడా ఉన్నాయి.
* న్యూజిలాండ్ చిలుకలకు పుట్టిల్లు.

 

Comments

comments