Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పాస్ పుస్తకాల్లో తప్పులు సరి చేయాలి

Pass book should make mistakes

రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ రాజేశ్ తివారి

మనతెలంగాణ/పెద్దపల్లి: పట్టా పాస్‌పుస్తకాల్లో దోర్లిన త ప్పులను సవరిస్తూ వివరాలను త్వరగా నమోదు చేయాల ని,ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ స్పెష ల్ సిఎస్ రాజేశ్ తివారి అధికారులను ఆదేశించారు.పట్టాపాస్ పుస్తకాల పంపిణీ,రైతుబంధు తదితర అంశాలపై సిఎల్‌ఎ సంచాలకులు వాకాటి కరుణతో కలిసి సోమవారం అ న్ని జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా నిర్వహించిన భూ శుద్ధీకరణ కార్యక్రమంలో జరిగిన పొరపాట్లను వెంటనే సవరించాలని అన్నారు. తహసీల్డార్లు పేజి 2వ సవరణ పై ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.తహసీల్ధార్లు వా రం,పది రోజుల్లో పట్టాదారు పాస్‌పుస్తకంలోని పొరపాట్ల ను సవరించాలని మొదటి దశలో ధృవీకరించని ఖాతాల వివరాలను ధృవీకరించి వారికి పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాలను పూర్తి చేయాలని,ప్రభుత్వం అందించిన అదనపు సమయాన్నిఅధికారులు పూర్తి స్థాయిలో సద్వినియో గం చేసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా అర్హత క లిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం,రైతుబంధు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.దూరదృశ్య సమీక్షాలో పాల్గొన్న పాలనాధికారి శ్రీదేవసేన మా ట్లాడుతూ జిల్లాలోని 209 గ్రామాల్లో అధికారులు క్షేత్ర స్థా యిలో పరిశీలించి పట్టాదారు పాస్‌పుస్తకాల్లో జరిగిన పొరపాట్లను గుర్తించి సవరించామని,ఆ వివరాలు నమోదు చే యడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న కారణంగా నమోదు ఆలస్యం అవుతుందని, వాటిని పరిష్కరించాలని కోరారు. జిల్లా లో 209 గ్రామాల్లో 1,26,284 ఖా తాలకు గాను 1,14,355 పాస్‌పుస్తకాలు ముద్రించి 1,0 1,147 పాస్‌పుస్తాకాలు పంపిణీ చేయడం జరిగిందని, జి ల్లాలో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పట్టా పాస్ పుస్తకాల్లో మొత్తం 4591 మొదటి పేజి సవరణలు, 6063 రెండవ పేజి సవరణలు గుర్తించి,4164 మొదటి పేజీ, 2687రెండవ పేజీ సవరణలు పూర్తి చేశామని అన్నారు. జిల్లాలో 7194 ఆధార్ నంబర్లను సవరించామని, 758ఖాతాలను మెర్జి చేశామని,8242 డాట ఎంట్రీ పోరపాట్లను సవరించామని తెలిపారు.జిల్లాలో భూ శుద్ధీకరణ కార్యక్రమం ముగిసిన తర్వాత 1062 మంది పట్టాదారులు మరణించారని 867 మంది పట్టాదారులు తమ భూమిని విక్రయించారని,ఆవివరాల ను కూడా సరిచేస్తామని,జిల్లాని పెండింగ్ సాదా బైనామాలను పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లాలో తహసీల్దార్లు పాల్గొన్నారు.

Comments

comments