Home నిజామాబాద్ పల్లెవెలుగు పత్తాలేదు

పల్లెవెలుగు పత్తాలేదు

పల్లెలకు రాని పల్లె వెలుగు బస్సులు
గ్రామాలకు ప్రయాణించడానికి ఆటోలే దిక్కు
పరిమితికి మించి ప్రయాణాలు, ప్రజల ప్రాణాలతో చెలగాటం
బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్న విద్యార్థులు,ప్రజలు
చోద్యం చూస్తున్న ఆర్టీసీ అధికారులు
ఇబ్బందుల్లో ఇరు గ్రామాల ప్రజలు

రోడ్ల దుస్థితో,ఆర్థిక నష్టాలో తెలియదు కాని ఆర్టీసి సేవలను గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా నిలిపివేసారు. స్వ రాష్ట్రంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో కోట్ల రూపాయలచే రోడ్ల విసర్తణ పనులు, మరమ్మతులు, నూతన రోడ్లు వేయించిన ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించడంలో విఫలం అయిందని ప్రయాణికులు వాపోతున్నారు. 

BUSమోర్తాడ్ :  సమైఖ్య రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత రోడ్ల దుస్థితి దయాణియంగా ఉండటంలో ఆర్టీసీ సేవలను గ్రామీణ ప్రాంతలకు విస్తరించడానికి అధికారులు సుముఖత చూపలేరు. రోడ్ల దుస్థితో,ఆర్థిక నష్టాలో తెలియదు కాని ఆర్టీసి సేవలను గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా నిలిపివేసారు. దింతో ప్రయాణికులకు అటోలే శరణ్యంగా మారాయి. తెలం గాణ రాష్ట్రం ఎర్పాడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కోట్ల రూపాయలచే రోడ్ల విసర్తణ పనులు,మరమత్తులు,నూతన రోడ్లు వేయించిన ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించడంలో విఫలం అయిందని ప్రయాణికులు వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందని పలు గ్రామాల ప్రజలు తమ అవేదనను వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం దూరప్రాంతాలకు గ్రామీణ ప్రాంత ప్రజలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. మండ లంలో ముఖ్యంగా మోర్తాడ్ మండలకేంద్రం నుండి సుంకెట్, రామన్నపేట్ ,జగిర్యా ల్, కుప్కాల్ గ్రామాల మీదుగా భీమ్‌గల్ మండలకేంద్రానికి వెళ్లలాంటే 18 కీలో మిటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఎర్పాడక ముందే మోర్తా డ్ నుండి భీంగల్ వరకు డబుల్ తారురోడ్డును నిర్మించారు.తారురోడ్డు నిర్మించారు కాదా బస్సు సౌకర్యం అర్‌టిసి అధికారులు కల్పిస్తారనే నమ్మకంతో ప్రజలు ఎదురు చుశారు. కాని రోడ్డు వేశారు బస్సును మరిచారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి కనీసం ఈ ప్రాంతం గుండా బస్సులు ఒక్క ట్రిప్పు కూడా రాకపోకలను అర్‌టిసి అధికారులు నడిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితిస్తుంది.

నిత్యం అటోలోనే ప్రయాణం

ఈ ప్రాంతం గుండా ప్రతి నిత్యం అటోలోనే ప్రయాణం చేయాల్సిన దుస్థితి నేలకోంది. ప్రతిరోజు నిజామాబాద్,ఆర్మూర్ ప్రాంతలకు వెళ్లి చదివే పాఠశాల, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం ఆటోలోనే కళశాలలకు ప్రయాణిస్తు చదువులు కోనసాగిస్తున్నారు. ఒక్కో అటోలో పరిమితికి మించి 12మంది ప్రయాణికుల నుండి 16మంది ప్రయాణిలను ఎక్కించుకోని తీసుకెళ్తుంటారు. అటోవాలాలు అటోలో ప్రయాణికులను అటో పూర్తిగా నిండే వరకు కూర్చోబెట్టుకోని వారి సమయాన్ని వృధా చేస్తున్నారనే అరోపణలు వినిపిస్తున్నాయి. మోర్తాడ్ మండలంలోని దోనకల్ ధర్మోరా,శెట్‌పల్లి గ్రామాలకు ప్రయాణించలంటే అటోలే శరణ్యంగా మారాయి. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్, తడపాకల్, బట్టాపూర్, గుమ్మిర్యాల్, దోంచంద గ్రామాలకు ప్రతి దినం అర్మూర్ డిపోకు చెందిన బస్సులు రెండు ట్రిప్పులతో సరిపెట్టుకుంటున్నాయి. దింతో ప్రయాణికులకు అటోలోనే ప్రయాణం రాకపోకలు చేయాల్సి పరిస్థితి నేలకోంది.

చోద్యం చూస్తున్న ఆర్టీసీ అధికారులు

చోద్యం చూస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రతి నిత్యం బిక్కుబిక్కుమంటూ అటోరిక్షాల్లో ప్రయాణాలు చేస్తున్న ప్రజలు ఎక్కడ అదుపుతప్పి ప్రాణాలు కోల్పోతమో అని భయందోళనకు గురవుతుంటే ఆర్టీసి అధికారులు మాత్రం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నరానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటోవాలాల దూకుడుకు కళ్లెం వేయాలని,వారి అగడాలపై చర్యలు చేపట్టాల్సిన అవసరం రవాణా శాఖ, పోలీసు అధికారులపై ఉందని ప్రజలు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించలాని కోరుతున్న ఇరు మండలాల ప్రజలు ఇప్పటికైనా ఆర్టీసి అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకోని ప్రతి రోజు బస్సు రాకపోకలను ఉదయం నుండి రాత్రి వరకు సాగించాల్సిన అవసరం ఉందని మోర్తాడ్ ఏర్గట్ల మండల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.