Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మొరాయించిన మిషన్.. హైరానా పడ్డ ప్యాసింజర్లు

passenger suffered because the railway station did not work with the computer
కారేపల్లి: సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి రైల్వే జంక్షన్‌లో ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే కంప్యూటర్, టికెట్ మిషన్ మొరాయించటంతో సింగరేణి ప్యాసింజర్ ఆలస్యంగా బయలుదేరిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. మణుగూర్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్ళాల్సిన సింగరేణి ప్యాసింజర్‌ రైల్వేస్టేషన్‌కు వస్తున్న క్రమంలో ప్రయాణికులకు టికెట్లు ఇవ్వటానికి బుకింగ్ క్లర్క్ కంప్యూటర్ ద్వారా చేసిన ప్రయత్నం విపలమైంది. మిషన్ ద్వారా టికెట్లు ఇద్దామంటే గతంలోనే మిషన్ చెడిపోయింది. దీంతో సింగరేణి ప్యాసింజర్ 15నిమిషాలు స్టేషన్‌లో ఉండాల్సిన పిరిస్ధితి వచ్చింది. చేసేది లేక రైల్వే అధికారులు అత్యవసర పరిస్ధితిలో ఉపయోగించే బ్లాంక్ పేపర్ టికెట్‌పే చేతితో వ్రాసి ప్రయాణికులకు అందించారు. సింగరేణి ప్యాసింజర్ స్టేషన్‌లో నిలిచిపోవటంతో ఈ రైలు ద్వారా వెళ్ళి డోర్నకల్ వెళ్ళి అక్కడి నుండి వేరొక రైలుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు హైరానా పడ్డారు.

Comments

comments