Home నిజామాబాద్ నిజామాబాద్ స్టేషన్‌లో కరీంనగర్ రైలు ప్రారంభం

నిజామాబాద్ స్టేషన్‌లో కరీంనగర్ రైలు ప్రారంభం

 Passenger train extended from Nizamabad to Karimnagar

నిజామాబాద్ నుండి కరీంనగర్ వరకు పొడిగించిన ప్యాసింజర్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, ఎమ్మెల్సీఆకుల లలితలు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న రైలు సౌకర్యం ఈ రోజు ప్రారంభించుకుంటున్నామని రైల్వే విభాగం వారు ప్రజల అవసరాలు గుర్తించి ఈ సదుపాయం కల్పించారని తెలిపారు. అందుకు రైల్వే అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రైల్వేలో అనేక సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ప్రత్యేకంగా మన    పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మంచి ఆరోగ్యానికి పరిసరాల శుభ్రత ఎంతో అవసరమని అన్నారు. రైలు నంబర్ 57601  రైలు కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్ జిల్లా కేంద్రం కాచిగూడ మధ్య అన్ని స్టేషన్‌లో ఆగుతుందని ప్రతి రోజు ఉదయం 6 గంటలకు కాచిగూడ నుండి బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణంలో ఈ రైలు కరీంనగర్ స్టేషన్‌లో మద్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని తెలిపారు.ఈ  కార్యక్రమంలో రైల్వే ఎడిఆర్‌ఎం సాయిప్రసాద్, సూర్యనారాయణ గుప్త, కార్పొరేటర్ నితిన్‌పాండే మనోహర్‌రెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.