Home తాజా వార్తలు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

Shamshabad-air-port2హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాందీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. దీంతో కోల్‌కతా వెళ్లావలసిన 120 మంది ప్రయాణికులు ఉదయం 5 గంటల నుంచి పడిగాపులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.