Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

Shamshabad-air-port2హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇండిగో సంస్థకు చెందిన విమానం ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కొచ్చికి ఇండిగో విమాన సర్వీసులో వెళ్లేందుకు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే అప్పటికే కొన్ని నిమిషాల ముందే విమానం వెళ్లిపోయిందని ప్రయాణికులకు విమానాశ్రయం సిబ్బంది తెలిపారు. దీంతో ప్రయాణీకులు అధికారులపై మండిపడ్డారు. ముందుగా టిక్కెటు కొనుగోలు చేసిన విమానం ఎందుకు ముందుగానే వెళ్లిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణీలకులు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.

Comments

comments