Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

26 మంది బాలికలను కాపాడిన ట్వీట్…

Passenger's timely tweet saves 26 minor girls from being trafficked

లక్నో: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ వల్ల 26 మంది మైనర్ బాలికలు దుండగుల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ముజఫర్‌పూర్‌-బాంద్రా అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తాను ఉన్న కోచ్ లో బాలికల పరిస్థితిని గమనించి వాళ్లను అక్రమ రవాణా చేస్తున్నారని నిర్ణయించుకోని పోలీసులకు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించాడు. తాను ఎస్‌ 5 కోచ్‌లో ఉన్నానని, దీంట్లో చాలా మంది మైనర్‌ బాలికలు ఏడుస్తూ కూర్చున్నారని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించి గోరఖ్‌పూర్‌ జిఆర్‌పి పోలీసులు రంగంలోకి దిగారు. 26 మంది బాలికలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలికలందరీ వయస్సు 10 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు.

Comments

comments