Search
Monday 24 September 2018
  • :
  • :

ఆటోల బంద్ ప్రశాంతం

Passengers traveling by foot

కాలినడకన ప్రయాణించిన ప్రయాణికులు
పట్టణంలో నిలిచిన 5వేల ఆటోలు
నేటి నుంచి రూ.10 నుంచి రూ.15లకు పెంచేందుకు నిర్ణయం
రోడ్లపై బారులు తీరిన ప్రయాణీకులు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాలమూరు పట్టణ వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల యూనియన్‌లు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆటోలు ఇళ్లకే పరిమితమై పోయ్యాయి. దీంతో ఆటోలు రోడ్లపైకి రాకపోవడంతో ఆటోలు లేక రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. దీంతో ఆటోలు ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు నానాఇబ్బందులు ఎదుర్కోన్నా రు. ఆటోలు అందుబాటులోకి లేకపోవడంతో పట్టణాల్లోన్ని ప్రయాణికులు రోడ్ల వెంట బారులు తీరారు. కొందరు వృద్ధులు, చిన్నారులు నడవలేక ఇబ్బందులు ఎదుర్కోన్నారు. సోమవారం ఉదయం నుంచే బందుకు పిలుపును ఇవ్వడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలు రోడ్లపై రాలేకపోయ్యాయి. కొన్ని ఆటోలు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా ఆటో యూనియన్ నాయకులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో ఆటోలు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కోన్నారు. పెరుగుతున్న ఖర్చులతోపాటు తమ ఆటో చార్జీలు పెం చాలని ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవా రం నుంచి పట్టణంలో తిరిగే ప్రయాణీకుల నుంచి మినిమం చార్జీ కింద రూ.10ల నుంచి రూ.15లకు పెంచనున్నట్లు యూనియన్ నాయకులు పేర్కొన్నారు.

నిర్మానుష్యంగా మారిన పాలమూరు పట్టణం
తమ డిమాండ్లు పరిష్కారించాలని ఆటో యూనియన్ నాయకులు బంద్‌కు పిలుపును ఇవ్వడంతో పాలమూరు పట్టణం నిర్మానుష్యంగా మారింది. పట్టణంలో 4వేలకుపైగా లోకల్ ఆటోలు, జిల్లా కేంద్రం వెలుపలి నుంచే వచ్చే మరో 1000 ఆటోలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. పాలమూరు పట్టణంలో బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆటో యూనియన్ నాయకులు ప్రత్యే క ఏర్పాట్లు చేయడంతో బంద్ సక్సెస్ అయ్యినట్లు తెలుస్తోంది. దూర ప్రాంతాల నుంచి బస్సులు,రైళ్లలో వచ్చే ప్రయాణికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు నానా తంటాలు ఎదుర్కోన్నారు. చేసేది లేక కొందరు ప్రయాణీకులు కాలినకడనే తమ ఇళ్లకు చేరుకున్నారు.

ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు
పట్టణ వ్యాప్తంగా ఆటోల బంద్‌కు పిలుపును ఇవ్వడంతో ప్రయాణీకులు నానా తంటాలు పడ్డట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని 4వేల ఆటోల ద్వారా నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సాగిస్తుంటారు. అంతేకాకుండా సోమవారం కావడంతో ప్రయాణికుల సంఖ్య సాధారణం కంటే అధికంగానే ఉంటుందనే చెప్పవచ్చు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో ఫీర్యాదులు అందించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రయాణీకులు వస్తుంటారు. అంతేకాకుండా శనివారం రంజాన్‌పండగ ఉండడంతోపాటు ఆదివారం సెలవుదినం కావడంతో ప్రభుత్వ,ప్రవేటు ఉద్యోగాలు చేసే ఉద్యోగులు సోమవారం విధుల్లో చేరేందుకు పయణం అయ్యారు. దీంతో ఆటోలు లేక పోవడంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కోన్నాట్లు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్నే వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసర పనులు ఉన్న ప్రయాణికులు తమ ఇళ్ల నుంచి బస్టాండు,రైల్వే స్టేషన్‌లకు కాలినడకన బయలు దేరి వెళ్లారు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణీకులు కూడా కాలి నడకనే ఇళ్లకు చేరుకున్నారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాల్సిందే : ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్
రోజురోజుకు పెరుగుతున్న డీజిల్, ఆటో పార్ట్, నిత్యవసర ధరల పెరుగుదలకు అనుగుణంగానే తమ ఆటో చార్జీలు కూడా పెంచాలని ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఐఎన్‌టియుసి ఆటో యూనియన్ నాయకులు రాములు యాదవ్ మన తెలంగాణతో మాట్లాడుతూ రోజుకు పెరుగుతున్న డిజిల్ ధరలకు కలెం వేసేందుకు డిజిల్, పెట్రోల్ ధరలకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా నోట్లరద్దు,జిల్లాల విభజనతో తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మంగళవారం నుంచి మహబూబ్‌నగర్ పట్టణంలో తిరిగే లోకల్ ఆటోలు కనీస చార్జీ కింద రూ.10ల నుంచి రూ.15లకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

comments