Home ఆదిలాబాద్ పాస్ట్‌ పుడ్ వేస్ట్ పుడ్

పాస్ట్‌ పుడ్ వేస్ట్ పుడ్

pasted waste foodనార్నూర్‌: మండలంలో పాస్టు పుడ్డు సెంటర్లలో ఆహార పదార్ధాల తయారి నాణ్యతలోపిస్తుంది. పరిశుభ్రత పాటించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. పుడ్ తయారిపై కనీస అవగాహన లేకున్న ఇష్ట రీతిన తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్క సారి వేడి చేసిన నూనెను వారం రోజుల పాటు నిల్వ ఉంచి పదార్ధాల తయారికి వాడుతున్నారు. నూనెలో పురుగులు ఈగలు పడి చనిపోతున్న అదే నూనెతో ఆహారాన్ని తయారు చేసి అమ్ముతున్నారు. వాటిని తిన్న వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ దుకాణాలపై ఇప్పటి వరుకు అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు ఆహార పధార్ధాలు ఎలా ఉన్నాయి. తయారికి ఎలాంటి నూనెలు ఉపయోగిస్తున్నారు. పరిశుభ్రత పాటిస్తున్నారా లేదా అని ఎవరూ చూడడం లేదు ఇప్పటికైనా సంబంధితా శాఖ అధికారులు తగ్గు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.