Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పఠాన్‌కోట్‌లో ముగిసిన భద్రతాదళాల ఆపరేషన్

Pathankot-Terror-Attackపంజాబ్: పఠాన్‌కోట్‌లో మూడు రోజులపాటు ముష్కరులను ఏరివేసేందుకు జరిగిన భద్రతాదళాల ఆపరేషన్ సోమవారం సాయంకాలానికి ముగిసింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను భారత బలగాలు తుదముట్టించాయి. ఎయిర్‌బేస్‌లో దాక్కున్న ఇద్దరు తీవ్రవాదులను సోమవారం భద్రతాదళాలు మట్టుబెట్టడంతో ఈ ఆపరేషన్‌కు తెరపడింది. ఈ ఉగ్రదాడిలో శనివారం నుంచి ఇప్పటి వరకు ఏడుగురు భద్రతాసిబ్బందితోపాటు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ముష్కరులు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో విధ్వంసం సృష్టించడమే లక్షంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. భారత రక్షణ దళాలు ఉగ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొవడంతో ఎయిర్‌బేస్‌కు ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.

Comments

comments