Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Untitled-1దిల్‌షుఖ్‌నగర్‌ః కొత్తపేటలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చైతన్యపూరి పోలీస్‌స్టేషన్ వెలుగులోకి వచ్చింది. సంఘటన స్థలంలో సేకరించిన వివరాలు, మృతుని తమ్ముడు కృష్ణాచారీ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా తుర్కపెల్లి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన బంగారు కొండాచారీ(38) భార్య అరుణ, కుమారులు కరుణాకర్‌సాయి, ప్రభాకర్ లు సంతానం. కొండాచారీ గత కొంత కాలం క్రితం నగరానికి వలసవచ్చి ఉప్పల్ డిపో పరిధిలోని బుద్దానగ ర్ కాలనీలో నివాసముంటున్నాడు. కొండాచారీ నరాల బలహీనతతో లేచినడవలేని స్థితిలో భాదపడుతూ ఈనెల 17వతేదిన కొత్తపేటలోని సాయిసంజీవని ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. వైధ్యపరిక్షలు నిర్వహించిన డాక్టర్‌లు ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో గురువారం రాత్రి ఆపరేషన్ నిర్వహించి డాక్టర్‌లు పేషంట్ ఆరోగ్యంగానే ఉన్నాడని, రెండు బాటిళ్ల రక్తం ఎక్కించాలని చెప్పినట్లు మృతుడి తమ్ముడు కృష్ణాచారీ తెలిపాడు. ఇంతలోనే మరో డాక్టర్ వచ్చి కొండాచా రీ మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఆగ్రహించిన మృతుడు బందువులు డాక్టర్ల నిర్లక్షం వల్లనే చనిపోయాడని ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహి ంచారు. నష్టపరిహారం చెల్లించడంతో బాధితులు ఆందోళన విరమించారు. డాక్టర్లు మాత్రం తమనిర్లక్షం లేదన్నారు. ఈ సంఘటనకు సంభందించి స్థానిక పోలీసులకు ఎలాంటి పిర్యాధు అందలేదు.

Comments

comments