Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అవయవ మార్పిడికి ఆర్థికసాయం

Health_manatelanganaమన తెలంగాణ / హైదరాబాద్, శేరిలింగంపల్లి: పేద రోగుల అవయవమార్పిడి శస్త్రచికిత్సల కోసం ఆర్థిక సహాయాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి తెలి పారు. నిమ్స్‌లో తొలి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజ యవంతమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆయన నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భం గా శస్త్రచికిత్సను విజయవంతం చేసిన వైద్యులను అభి నందించారు. కాలేయమార్పిడి శస్త్రచికిత్స చేయించు కున్న రోగి సత్యమయ్యను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయమార్పిడి శస్త్రచికిత్స జరగగా, ప్రస్తు తం నిమ్స్ ఆసుపత్రిలోనూ కాలేయమార్పిడి శస్త్రచికిత్సను తొలిసారిగా నిర్వహించారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఇది రెండవ అవయవమార్పిడి శస్త్రచికిత్స అని, భవిష్యత్తులో ప్రభుత్వాసుపత్రుల్లో అవయవమార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య పెరిగేందుకు వైద్యులు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ చికిత్స కోసం ప్రభుత్వం రూ.10.50 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించిందని, భవిష్యత్తులోనూ అవయవమార్పిడి తప్ప నిసరైన పేద రోగులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. సత్యమయ్య శస్త్రచికిత్సకు ప్రభుత్వం తరపున రూ.10.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సాయం పేద ప్రజలకు వరం లాంటిదన్నారు. రోగాలు ముదిరిపోయి అవయవమార్పిడి చేస్తే తప్ప బ్రతకలేని చాలా మంది రోగులు కేవలం ఆర్థిక స్థోమత లేని కారణంగా మరణిస్తున్నారని, ప్రభుత్వం వారందరి ని ఆదుకుంటుందన్నారు. పేదవారికి ఇలాంటి వైద్యాన్ని అందించడం తమకు సంతోషంగా ఉందన్నారు.

గత ప్రభుత్వాలే కారణం..
గత ప్రభుత్వాల తీరు వల్లె ఉస్మానియా ఆసుపత్రి ఈ స్థితికి చేరుకుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. లకా్ష్మరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చందానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అను డెంటల్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిదిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్ళుగా పాలనలో ఉన్న ప్రభుత్వాల కళ్లకు కనబడని ఉస్మానియా ఆసుపత్రి, నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిని పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోగానే ఇలా తప్పుడు మాటాలు మాట్లాడడం సరైన పద్దతి కాదన్నారు. గత ప్రభుత్వాలకు చేతకాని పనులను కెసిఆర్ ప్రభుత్వం చేస్తుండడం ఓర్వలేని వారు, రాష్ట్ర అభివృద్దిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ఊరు కునేది లేదన్నారు. ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థలో ఉందని దానిని పునరుద్దరించడానికే ఈ చర్యలు తీసు కున్నామని ఆయన తెలిపారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగం, ఔట్ పెషెంట్ విభాగాలను అక్కడే ఉంచుతు న్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రి తరలింపులో రోగు లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రతీ జిల్లా ఆసుపత్రులలో వైద్యా నికి కావాలిసిన అన్ని రకాల అత్యాధునిక పరికరాలను, పడకల సంఖ్యను పెంచి బీద, ధనిక తేడా లేకుండా అందరికి సమాన దృష్టిలో కార్పొరేటు వైద్యాన్ని అందిం చడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ప్రైవే ట్ ఆసుపత్రులకు గత ప్రభుత్వాల హయంలో తలె త్తిన అడ్డంకులను పూర్తిగా అధిగమించి, వారి అభివృద్దికి ప్రభుత్వ సహాయసహకారాలు ఉంటాయన్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు పేదలను దృష్టిలో ఉంచుకుని వారి ఆర్థిక స్థోమతలను గమనించి వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అన్నారు. ఈ కార్య క్రమంలో శేరిలింగంపల్లి నియోజక వర్గ టిఆర్‌ఎస్ ఇంచార్జీ కొమరగోని శంకర్‌గౌడ్, అను డెంటల్ ఆసుపత్రి ఎండీలు సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments