Home తాజా వార్తలు సమస్యల్లో ఎంజిఎం… అవస్థల్లో రోగులు

సమస్యల్లో ఎంజిఎం… అవస్థల్లో రోగులు

Warangal MGM Hospitalప్రధాన విభాగాల రోగులకు వైద్యులు కరువు,  రిపేర్లలో డయాగ్నస్టిక్ మిషన్లు,  పడిగాపులతో కిక్కిరిస్తున్న రోగులు  ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్షం పై విమర్శలు

వరంగల్ టౌన్: ఉత్తర తెలంగాణలో రోగులకు ఏకైక పెద్ద దిక్కు,ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్,వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రతి రోజు వేలాది మంది రోగులు అనేక వ్యయ ప్రయాసాలకోర్చి ఇక్కడికి వస్తే నాణ్యమైన వైద్యం కరువవుతున్నది. అన్ని రోగాలకు డాక్టర్లు లేరు. కొన్ని విభాగాలకైతే డాక్టర్లు అసలే లేరు. లేని విభాగాలకు సమీప విభాగాలకు డిప్యూటేషన్ మీద పంపి వైద్యం అందిస్తున్నారు. కొన్ని చోట్ల డాక్టర్లు పరీక్షలు సూచిస్తే పరీక్షలు చేయించుకోవడానికి అక్కడ మిషన్లు రిపేర్లలో వున్నాయి. ఒకవైపు తీవ్రమైన వైద్యుల కొరత, మరోవైపు ఎక్కువ సంఖ్యలో రోగుల జనసమ్మర్థం తో వైద్యం చేయించుకోవాల్సిన రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దినదినం వైద్యరంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని రోగుల నిష్పత్తి కంటే కాస్త ఎక్కువగానైనా వైద్యసిబ్బందిని సమకూర్చుకుని సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌గా ఎదగాల్సిన ఎంజిఎం నానాటికి సమస్యల కొలిమిలో నలిగిపోతున్నది. దీనికంతటికి ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్షధోరణే ప్రధాన కారణమని ఓ వైపు వైద్యులు, మరవైపు రోగులు, రోగి బంధువులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

విభాగాల్లో వైద్యుల కొరత..

దీనిలోకి వచ్చే వివిధ రకాల రోగులకు చికిత్స అందించేందుకు సుమారు ఇరవై రెండు విభాగాలున్నాయి. వీటిలో ప్రధానంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ,ఆర్థోపెడిక్, పిడియాట్రిక్, యూరాలజీ, నెప్రాలజీ, న్యూరాలజీ, నెప్రాలజీ, న్యూరోసర్జరీ తదితర విభాగాలకు మాత్రం ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తున్నారు. కాని దీనిలో జనరల్ మెడిసిన్,జనరల్ సర్జన్, ఆర్థో లకు మాత్రమే చెప్పుకోతగ్గ వెద్యసిబ్బంది ఉన్నారు. తక్కిన విభాగాల్లో వైద్యులు నామమాత్రంగానే వున్నారు. కొన్ని విభాగాల్లో ఆ విభాగాల వైద్యులు అసలే లేరు. వీటిలో యూరాలజీ, నెప్రాలజీ, న్యూరాలజీలు వున్నాయి. అసలే ఈ విభాగాల రోగులకు వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే నడుస్తున్నాయి. ఈ రోజులలో కూడా సంబంధిత వైద్యులు కాకుండా ఇతర విభాగాల డాక్టర్లు డ్యూటీలు చేస్తున్నారు. వీరు కూడా పిజి డాక్టర్లే కావడం గమనార్హం. దీంతో గత్యంతరం లేని పరిస్థితులలో రోగులు చూపించుకుంటున్నారు.

ఒకే ఒక్కడు..

రోగులకు అత్యవసర విభాగాల్లో ఒకటైన న్యూరోసర్జరీ విభాగంలో ఒకే ఒక్క వైద్యుడు అన్నీ తానై పనిచేస్తున్నాడు .న్యూరోసర్జరీ హెచ్‌ఓడి గా డాక్టర్ రాజమోహన్ తన సేవలందిస్తున్నాడు. సమీప ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ కేసులు రేయింబవళ్లు వస్తున్నాయి.దీనిలో ఎక్కువ సంఖ్యలో న్యూరో విభాగానికి కూడా ఎక్కువ వస్తున్నాయి. కాని దీనికి ఈ డాక్టర్లు లేక పోవడంతో నైట్‌డ్యూటీలు కూడా ఈయనే చేయాల్సి వస్తున్నది. ఈయనకు జనరల్ సర్జరీ పిజి డాక్టర్లు సహాకరిస్తున్నారు. దీనికి రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతుండటంతో ఆయన అలసిపోతున్నారు. ఎక్కువ సంఖ్యలో వస్తున్న కేసులకు ఈయన పూర్తి న్యాయం చేయలేక పోతున్నారు .ఒక వైపు క్యాజువాలిటి ఇంకోవైపు ఇన్‌వార్డులోని రోగులను, మరోవైపు ఓపి నుంచివస్తున్న కేసుల రోగులకు అన్ని వేళల్లో అన్నీ తానై రాజమోహన్ శ్రమిస్తున్నారు.ఈ విభాగంలో వస్తున్న క్రిటికల్ కేసులను అత్యవసరంగా మెరుగైన చికిత్సకోసం ఇతర హాస్పిటల్స్‌కు రిఫర్ చేస్తున్నారు.

దశాబ్థాలుగా భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు..

దీనిలో ఔట్‌గోయింగే కాని ఇన్‌కమింగ్ లేని పరిస్థితి నెలకొందని కొందరు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సుమారు వందమంది ఉండాల్సిన వైద్య పోస్టులలో కేవలం నలబై రెండు మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులను దశాబ్థాలుగా వీటిని పూరించడం లేదు. రోజుకు సుమారు రెండువేలన్నర మంది రోగులు ఒపికి, మూడు వందల మంది ఎమర్జెన్సీ రోగులకు సరిపడేంత మంది ఉండాల్సిందే. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో రిటైర్ అవుతున్నా వారి స్థానంలో కొత్త వారిని నియమించక పోవడంతో ఇబ్బందులకు గురికావాల్సివస్తున్నది. ప్రతి సారి అన్ని రకాల పోస్టులను భర్తీచేస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా నేటికీ భర్తీ చేయకపోవడం బాదాకరం.

మిషన్ల రిపేర్ ఎప్పుడో..

రోగులకు రోగ నిర్ధారణ కోసం చేయాల్సిన పరీక్షలు పడకేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఎంఆర్‌ఐ మిషన్, దాని సంబందిత జనరేటర్‌లు రిపేర్ కొచ్చాయి. కాని రోజులు గడుస్తున్నా రిపేర్ కావడం లేదు. గుండె తదితర వైద్యం కోసం చేసే టూడీ ఎకో పరీక్షలు ఆ మిషన్ రిపేర్‌కు రావడంతో దానిని గత కొంతకాలంగా నిలిపివేశారు. దీనిని రిపేర్ చేయాల్సింది.

Patients Facing Problems in Warangal MGM Hospital