Search
Saturday 17 November 2018
  • :
  • :

వీళ్లు మాములోళ్లు కాదు.. ఏకంగా గిన్నిస్‌కు ఎక్కేశారు

Shortest-Couple

బ్రెజిల్: దేశానికి చెందిన ఓ జంట గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించింది. అయితే వీళ్లు గిన్నిస్ ఎక్కింది కేవలం వాళ్ల ఎత్తుతో. ప్రపంచంలోనే అతి పొట్టివారిగా పేరొందిన ఈ జంట తమ ఎనిమిది ఏళ్ల ప్రేమకు స్వస్తి పలికి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఒకే దేశానికి చెందిన 31 ఏళ్ల పాలో గేబ్రియల్, 28 ఏల్ల కట్యూసియా ఈ నెల 17న పెళ్లి చేసుకున్నారు. పాలో 35.54 అంగుళాల ఎత్తు ఉండగా, అతని భార్య కట్యూసియా 35.88 అంగుళాల ఎత్తు ఉంది. కాగా, ఇంతకుముందు అతి పొట్టి దపంతులుగా డగ్లస్, క్లారియాల రికార్డును ఈ కొత్తజంట బ్రేక్ చేసింది. తమకు గిన్నిస్‌లో చోటు లభించడం ఆనందంగా ఉందని పాలో, కట్యూసియా మురిసిపోయారు.

Comments

comments