Home Elections 2018 తెలంగాణలో పోటీపై సమాలోచనలు : పవన్

తెలంగాణలో పోటీపై సమాలోచనలు : పవన్

Pawan Kalyan Comments on Telangana Assembly Elections

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్టు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే రెండుమూడు రోజుల్లో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం, ఎన్నికలకు పార్టీ సన్నద్ధత లేకపోవడంతో పోటీపై సమాలోచనలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ముందస్తు కాకుండా వచ్చే ఏడాది ఎన్నికలు వస్తే , 23 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నామని ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు రావడంతో తెలంగాణలో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొందని ఆయన వెల్లడించారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని, మద్ధతు ఇవ్వాలని కొందరు తనను కోరారని ఆయన తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అన్ని అంశాలు పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.