Home ఆంధ్రప్రదేశ్ వార్తలు జగన్‌కి కౌంటర్ ఇచ్చిన జనసేనాని…

జగన్‌కి కౌంటర్ ఇచ్చిన జనసేనాని…

 Pawan Kalyan అమరావతి: ఎపిలో రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది ఫిబ్రవరిలో ప్రకటిస్తానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ పేర్కొన్నారు. నేతలు తమ పార్టీలను వారి అవసరాలకు తప్ప ప్రజల కోసం నడపటం లేదని పవన్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో కరవు నివారణకు సమగ్ర ప్రణాళిక అవసరమన్న ఆయన జిల్లాలో సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరవు సమస్యపై జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
జనసేన పార్టీని తాము గుర్తించడం లేదన్న వైసిపి నేతలకు, ఆ పార్టీ అధ్యక్షుడికి పవన్ కల్యాన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ గుర్తించనంత మాత్రాన తమ పార్టీకి గుర్తింపు లేనట్టు కాదన్నారు. ఆయన ఒక్క పిలుపుతో లక్షల మంది కవాతులో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. జనసేన పార్టీకి వైసిపి గుర్తింపు అవసరం లేదని పవన్ స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీకి వెళ్లరు, ప్రజాసమస్యలను పట్టించుకోరని ఆయన ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా సమస్యలు తన దృష్టికి పవన్ చెప్పుకొచ్చారు. రైతులు, చేనేతలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ యువత ఉపాధి అవకాశాలు లేక వలసపోతున్నారని జనసేన అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. కరువు నిర్మూలనకు శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంటను పండించాలని యువతకు సూచించారు. వాస్తవాలను దాచి సిఎం చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Pawan Kalyan Counter to YS Jagan