Home ఆంధ్రప్రదేశ్ వార్తలు జనసేన అధినేతకు డబుల్ షాక్

జనసేన అధినేతకు డబుల్ షాక్

Pawan Kalyan Defeated at both Gajuwaka and Bhimavaram

 

రెండు చోట్ల పవన్‌కళ్యాణ్ ఓటమి
లగడపాటి జోస్యం నిజం కాలేదు
పార్టీ శ్రేణుల్లో నిరాశ

మనతెలంగాణ/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఊహించని దెబ్బ తగిలింది. (వైఎస్‌ఆర్ సిపి పార్టీ) ఫ్యాన్ గాలికి జనసేన చతికిలబడింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు గాజువాక, భీమవరం స్థానాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. పవన్‌పై గాజువాకలో వైసిపి అభ్యర్థి నాగిరెడ్డి విజయం సాధించగా, భీమవరంలో వైసిపికి చెందిన గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. సుమారు రెండు వేలకు పైగా మెజార్టీతో ఆయన పవన్‌కళ్యాణ్‌పై గెలుపొందారు. ఎపి ఎన్నికల్లో జనసేన, బిఎస్పీ, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి.

రాష్ట్రం మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ రావు గెలుపొందారు. అక్కడ రౌండ్ రౌండ్‌కి ఫలితం తారుమారు కావడంతో ఈ స్థానం ఎవరు గెలుస్తారన్న దానిపై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. పవన్ ఓటమిని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇటీవల మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ పవన్ అసెంబ్లీలో అడుగు పెడతారని జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. జనసేనకు మెగాస్టార్ పిఆర్పీ కంటే తక్కువ సీట్లు వస్తాయని లగడపాటి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్క స్థానాన్ని మాత్రమే జనసేన గెలవడం ఆ శ్రేణులను నిరాశ పరుస్తోంది.

Pawan Kalyan Defeated at both Gajuwaka and Bhimavaram