Search
Sunday 23 September 2018
  • :
  • :

ప్రజలను మోసం చేయను: పవన్ కల్యాణ్

If people give the chance I will form the new Government says Pawan Kalyan

ఇచ్ఛాపురం: తాను గెలుస్తానో లేదో తెలియదు కానీ, ప్రజలను మాత్రం మోసం చేయనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆదివారం ఇచ్ఛాపురంలో జరిగిన జనసేన పోరాట యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ప్రత్యేక హోదా కోసమే తెదేపాకు మద్దతిచ్చాను. చట్ట సభల్లో చెప్పేవి పాటిస్తారని త్రికరణ శుద్ధిగా నమ్మా. కానీ, ఏళ్లు గడుస్తున్నా ప్రత్యేకహోదా రాలేదు. ఇక్కడ డ్రైనేజీ సమస్య అలాగే ఉంది. ఉద్దానంలో కిడ్నీ సమస్య అలాగే ఉంది. హార్వర్డ్‌ నుంచి నేను వైద్యులను తీసుకొస్తే, ప్రభుత్వం కొంచెం మాత్రమే కదలిక వచ్చింది. ము న్యాయంగా వెళతాం. మీరు బతకండి. మమ్మల్ని బతకనివ్వండి. కాదు కూడదు అణగదొక్కుతామంటే ఉవ్వెతున్న సునామీ కెరటంలా పైకి లేస్తాం. బెదిరిస్తే చేతులు కట్టుకొని కూర్చొనే వ్యక్తులం కాదు.. ఎదురుదాడి చేస్తాం. మేము ప్రజా పక్షం అందుకే.. వైకాపా, తెదేపా, భాజపా విమర్శిస్తున్నాయి. ప్రజల కోసం పనిచేసే జన సైనికులం.’’