Home ఆంధ్రప్రదేశ్ వార్తలు వడదెబ్బతో పవన్ నీరసించారు: చెర్రీ

వడదెబ్బతో పవన్ నీరసించారు: చెర్రీ

Ram Charan

 

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వడ దెబ్బ తగలడంతో నీరసంగా ఉన్నారని హీరో రామ్ చరణ్ తెలిపారు. తన ట్విట్టర్ లో పవన్‌ను పరమార్శించిన ఫోటోను చరణ్ పోస్టు చేశారు. పవన్ అనారోగ్యంగా ఉండడంతో విజయవాడలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్‌ను ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసేందుకు రాంచరణ్ కలుసుకున్నారు. తాను చాలా ఇష్టపడే పవన్ బాబాయ్‌ను కలిశానని, పవన్ చాలా నీరసంగా ఉన్నాడని తెలిపారు. ఎన్నికల దగ్గర పడుతుండడంతో పవన్ ఆదివారం ప్రచారం కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రచారంలో వైద్యులు ఉంటామని చెప్పిన కూడా పవన్ వద్దని వారించాడని చరణ్ పేర్కొన్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని ప్రార్థించానన్నారు. 

రామ్ చరణ్ భార్య ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తనకు రాజకీయాల గురించి ఏక్కువగా తెలియదని, కుటుంబ సభ్యురాలిగా, స్నేహితురాలిగా ఎలా సహాయం చేయాలని తెలుసునని, తన కుటుంబ నుంచి ఈ ఎన్నికలలో ఎవరైతో పోటీ చేస్తున్నారో వారికి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఎన్నికలంటే చాలా కష్టమని, భారతీయులుగా మనం ఓటు వేయాలని పిలుపునిచ్చారు.