Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పవన్ మర్రిచెట్టు లాంటివాడు : త్రివిక్రమ్

Katamarayudu

పవన్‌కళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ ‘నాకు అభి మానులంటే చాలా ఇష్టం. చాలా మంది అభిమానులు ఈ వేడుకకు రాలేకపోయారు. పెద్ద ఫంక్షన్ చేద్దామని అనుకున్నా నేనే వద్దన్నాను. ఎందుకంటే అభిమానులకు ఏదై నా జరిగితే నాకు బాధగా ఉంటుందనే తప్ప వేరే కారణం కా దు. నేను సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను. ఏదో టెక్నీషియన్ అవుదామని అనుకున్నాను కానీ హీరో అయిపోతానని అనుకోలే దు. అయితే నాకు ఏ పని ఇచ్చినా చాలా నిజాయితీగా పనిచేస్తాను.

అందుకే హీరో అయిన తర్వాత ఎంతో కష్టపడుతూ, ఒళ్లు దగ్గర పెట్టు  కొని పనిచేస్తున్నాను. ఇవాళ ఒక ఆలోచనతో ఈ సినిమా తీశాం. నచ్చి తే చూడండి… నచ్చకపోతే ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరిస్తా. శరత్ మరార్ మంచి మిత్రుడు. ఆయన కోసమే ఈ సినిమా చేశా. డాలీ చాలా సున్నితమైన దర్శకుడు’అని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఒక వ్యక్తి చేయి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి కోట్లలో కొం తమందికి మాత్రమే దేవుడు ఇస్తాడు. ఆయనెవరనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మర్రి చెట్టు వేసవిలో ఎండ, వానకాలంలో వాన, చలికాలంలో చలి నుంచి రక్షణ ఇస్తుంది. కానీ నన్ను గుర్తించమని ఎప్పుడూ కోరదు. అ లాంటి వ్యక్తి పవన్‌కళ్యాణ్. నా సినిమాలోని పాటలను ఈ సినిమా టైటిల్‌గా పెట్టడం సంతోషంగా ఉంది’అని తెలిపారు.

చిత్ర దర్శకుడు కిషోర్ పార్థసాని మాట్లాడుతూ ‘ఈ సినిమా టీజర్ చూస్తుంటే నేనే ఈ సినిమాను డైరెక్ట్ చేశానా అని అనిపించింది. గోపాల గోపాల సమయంలోనే నాతో మరో సినిమా చేస్తా నని పవన్‌కళ్యాణ్ మాటిచ్చారు. అన్నమాట ప్రకారమే నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయనతో మరో ఐదు, ఆరు సినిమాలు చేయాలనుంది’ అని చెప్పా రు. నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చేయాలనుకోగానే అన్నీ మంచి పరిణామాలు జరిగాయి. సినిమాలో పంచె కట్టులో పవన్ ఎంతో అం దంగా ఉన్నారు. అందరూ సినిమా కోసం బాగా కష్టపడ్డారు’  అన్నారు. ఈ కార్యక్రమంలో అనూప్ రూబెన్స్, బండ్ల గణేష్, రామజోగయ్యశాస్త్రి, అజయ్, కమల్ కామరాజు, శివ బాలాజీ, కృష్ణచైతన్య, రామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments