Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

‘అమ్మో… శృతి ని భుజాలపై మోయడం నావల్ల కాదు బాబు…’

Pawan Kalyan and Shruti Hassan in Katamarayudu

పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయడు ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ తో ఇంటర్నెట్ లో నానుతూనే ఉంది. ఇక.. కాటమరాయుడు మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది.

అయితే.. ఇప్పుడు పవన్, శృతి కి సంబంధించిన ఇంకో న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ మధ్య వచ్చే ఓ సీన్ ను చేయడానికి పవన్ నిరాకరించాడని ఆ న్యూస్ సారాంశం.

ఓ సన్నివేశంలో పవన్.. శృతిని తన భుజాలపై ఎత్తుకొని నడవాలట. అయితే… ఆ సీన్ తాను చేయలేనని… సీన్ లో కొన్ని మార్పులు చేసుకోవాలని డైరెక్టర్ కు సూచించాడట పవన్.

గత కొద్ది రోజులుగా పవన్ వెన్నునొప్పి తో బాధపడుతున్నాడట. అందుకే… శృతి ని భుజాలపై ఎత్తుకొనే సీన్ ను చేయనన్నాడనే పుకార్లు నెట్ లో తెగ పుట్టుకొస్తున్నాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఏప్రిల్ 28 న రిలీజ్ అవనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించినప్పటికీ… నాలుగు రోజుల ముందే మూవీ రిలీజ్ అవనున్నట్లు సమాచారం…

Comments

comments