Home తాజా వార్తలు శ్రీరెడ్డి పోరాటంపై పవన్ స్పందన…

శ్రీరెడ్డి పోరాటంపై పవన్ స్పందన…

Pawan-kalyan-resond-on-srir
సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణాల మీద శ్రీరెడ్డి పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేస్తున్న పోరాటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి లేదా… కోర్టును ఆశ్రయించాలి అప్పుడే న్యాయం జరుగుతుందని పవన్ అన్నారు. టివిలో చర్చల పెట్టడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన తెలిపారు. పబ్లిసిటి కోసం కాకుండా న్యాయం కోసం పోరాటం చేయాలని సూచించారు. ఇలాంటి అన్యాయాలకు గురవుతున్నవారికి తన సపోర్టు ఎప్పుడు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.