Home తాజా వార్తలు ‘సైరా’ టీజర్‌ చూసి పవన్‌ ఏమన్నారంటే…?

‘సైరా’ టీజర్‌ చూసి పవన్‌ ఏమన్నారంటే…?

Pawan Kalyan Response Sye Raa Teaser

హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవి 64వ బర్త్‌డే సందర్భంగా కొత్త మూవీ ‘సైరా నరసింహారెడ్డి‘ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులను ఒక రోజు ముందుగానే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు మెగాస్టార్. పుట్టిన రోజు వేడుకలకు ఒక రోజు ముందుగానే విడుదలైన ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిరు మరోసారి అభిమానులను ఫిదా చేశారు. అయితే చిత్ర నిర్మాత, చిరు తనయుడు రాంచరణ్‌ ఈ టీజర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్నివెల్లడించారు. మంగళవారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగిన మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘నాకు సైరా టీజర్‌ ఫైనల్‌ అవుట్‌పుట్ ఉదయం 10.45కి వచ్చిందని, వెంటనే నేను ఆ టీజర్‌ను పవన్ బాబాయ్‌కి పంపించాను. 11.10కి బాబాయ్‌ దగ్గర నుంచి ‘టీజర్‌ అదిరిపోయింది. థియేటర్లో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నాను’ అని రిప్లయ్‌ వచ్చింది’ అంటూ అభిమానులకు చరణ్‌ చెప్పారు. ఇక చిరంజీవి జన్మదిన వేడుకల్లో మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.