Home ఆంధ్రప్రదేశ్ వార్తలు జగన్ సిఎం కాలేడు: జనసేనాని

జగన్ సిఎం కాలేడు: జనసేనాని

Pawan Kalyan

అమరావతి: జగన్ పాపం చేశాడు… సిఎం కాలేడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పాపాలు ఆయనను వెంటాడుతున్నాయని, దేవుడు ఆయన్ను క్షమించే అవకాశం లేదని పవన్ వ్యాఖ్యనించారు. జగన్ ఎప్పటికి  సిఎం కాలేడని  పవన్ కల్యాణ్ జోస్యం చేప్పారు. గురువారం రాత్రి అమలాపురం గడియార స్తంభం దగ్గర జరిగిన సభలో పవన్ మాట్లాడారు. జగన్, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఇస్టానుసారంగా ప్రజా ధనాన్ని కాజేసాడు… జగన్ ను దేవుడెలా కరుణిస్తాడని జనసేనాని ప్రశ్నించారు. జగనేమీ దేశం కోసం పోరాడిన మండేలా మాదిరిగా జైలుకు పోలేదని, లక్షన్నర కోట్లు సంపాదించుకుని జైలుకు వెళ్లాడని పవన్  ఘాటు విమర్శలు చేశారు.

కోడికత్తి గుచ్చుకుంటే దాన్ని పెద్ద విషయంలా రచ్చ చేస్తున్నారని, ఈ తరహా చిల్లర పాలిటిక్స్ తో ప్రజలకు దగ్గర కాలేరని పవన్ విరుచుకుపడ్డారు. అవినీతిరహిత పాలనను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. నాడు చంద్రబాబును నమ్మి గతంలో మద్దతిచ్చానని, కానీ… ఆయన ఇప్పుడు ‘అవినీతికి బాప్’గా మారారని జనసేనాని మండిపడ్డారు.

Pawan Kalyan Sensational Comments on YS Jagan

telangana latest news