Home ఆంధ్రప్రదేశ్ వార్తలు భీమవరంలో జనసేనాని వెనుకంజ…

భీమవరంలో జనసేనాని వెనుకంజ…

pawan-kalyanఅమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్‌ విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ తొలి రౌండ్‌లో జనసేనాని వెనుకంజలో కొనసాగినప్పటికీ.. రెండో రౌండ్‌కి వచ్చేసరికి ఆయన పుంజుకున్నారు. వైసిపి అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై  పవన్‌ కల్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక భీమవరంలో మాత్రం పవన్‌ వెనుకంజలో ఉన్నారు. పవన్‌పై టిడిపి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తాజా అప్ డేట్స్ ఫలితాల ప్రకారం రాష్ట్రావ్యాప్తంగా వైసిపి 150 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. టిడిపి 24 స్థానాల్లో ముందంజలో ఉంది. నగరిలో రోజా ముందంజలో ఉన్నారు. మంగళగిరిలో నారాలోకేశ్ వెనకంజలో ఉన్నారు.

pawan kalyan Step back in bhimavaram