Home జాతీయ వార్తలు నేను సమాజానికి రక్షకుడిని : పవన్

నేను సమాజానికి రక్షకుడిని : పవన్

Pawan Kalyan Tweet on Jagan Comments

అమరావతి: వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఇటీవ‌ల ప‌వ‌న్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప‌వ‌న్ అభిమానులు జ‌గ‌న్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల‌కి ప‌వ‌న్ త‌న విన్న‌పాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు. జ‌గ‌న్ ఆరోపించిన తీరు చాలా మందికి బాధ క‌లిగించిన‌ట్టు తన దృష్టికి వ‌చ్చిందని చెప్పారు. తను ఎవ‌రి వ్య‌క్తిగ‌త జీవితాల‌లోకి వెళ్ల‌నన్నారు. అంతేకాకుండా అది రాజ‌కీయ ల‌బ్ధి కోసం అసలు వాడ‌నని పవన్ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌ చెందిన పాల‌సీల మీద‌నే పార్టీల‌తోనే తాను విభేదిస్తానని గుర్తు చేశారు. వ్య‌క్తిగ‌తంగా తనకు ఎవ‌రితో విభేదాలు లేవని చెప్పారు. ఈ క్రమంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారి కుటుంబ స‌భ్యుల‌ని కాని, వారి ఇంటి ఆడ‌ప‌డుచుల‌ని వివాదంలోకి లాగొద్దని మ‌న‌స్పూర్తిగా వేడుకుంటున్నానని పవ‌న్ కళ్యాణ్ త‌న ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరారు.

భీమవరంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జ‌గ‌న్‌పై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఫ్యాక్షనిస్టులు ఇష్టానుసారంగా మాట్లాడితే సైనికుడు ఉప్పెనలా పోరాడుతాడని పవన్ స్పష్టం చేశారు. దూరం నుంచి చూస్తే తాను చూడడానికి మెతకగా కనిపిస్తానని, దగ్గరకొస్తే తన పవర్ చూపిస్తానని పవన్ హెచ్చరించారు. సిన్మాల్లో డ్యాన్సులు చేసి, డైలాగులు చెప్పానని అనుకుంటున్నారేమో… బయటకు రండి నేనేంటో చూపిస్తానన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే మీకంటే బలంగా చేస్తాను. నా వెనుక వేల కోట్ల ఆక్రమాస్తులు లేవు.  తన వెనక కేవలం ప్రజాభిమానమే ఉందన్నారు. చిన్నప్పుడు బాడీగార్డునవుతానని చెప్పేవాడిని. ఈ రోజు నేను సమాజానికి రక్షకుడిని అంటూ జనసేనాని ఉద్వేగంతో నిప్పులు చెరిగారు.