Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పవన్-త్రివిక్రమ్‌ల మూవీకి లాంగ్ బ్రేక్?

pk

‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత పవన్‌కళ్యాణ్ పెద్దగా గ్యాప్ ఏమీ తీసుకోకుండానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను మొద లుపెట్టేశాడు. రెండు నెలల పాటు నిర్వి రామంగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొ న్నాడు పవన్. ఈ చిత్రాన్ని దసరా పండుగ బరిలో నిలబెట్టాలన్న పట్టుదలతో వేగంగా షూటింగ్ చేశారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో… ఈ చిత్రాన్ని దసరాకు కాకుండా సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయిం చుకున్నారట ఫిల్మ్‌మే కర్స్. ఎలాగూ సినిమా వాయిదా అనేసరికి ఇప్పుడు పవన్, త్రివిక్రమ్‌లు షూ టింగ్ విషయంలో అంత పట్టుదలగా ఏమీ లేనట్లుగా ఉంటున్నారట. కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది నితిన్ కోస మేనని అంటున్నారు. పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. పాటల రచయిత కృష్ణచైతన్య ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాల్ని త్రివిక్రమ్ స్వయంగా పర్యవేక్షించి ఈ ప్రాజెక్టును పట్టా లెక్కించ బోతున్నాడట. పవన్ కూడా కొంచెం విశ్రాంతి తీసుకొని రాజకీయ వ్యవహారాల్ని చక్కబెట్టాల్సి ఉండటంతో ఈ బ్రేక్ తీసుకుం టున్నట్లు సమా చారం. నెలకు పైగా విరామం తర్వాత షూటింగ్ మళ్లీ మొదలయ్యే అవకాశముంది. దీన్నిబట్టి ఈ చిత్రం దసరా రేసులో లేనట్లే అని తెలిసి పోయింది.

Comments

comments