Home సినిమా వైరల్ గా మారిన పవన్ ఫ్యామిలీ పిక్..

వైరల్ గా మారిన పవన్ ఫ్యామిలీ పిక్..

pawan

విజయవాడ: పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణూ దేశాయ్ నుండి విడిపోయిన తర్వాత అన్నా లెజోనావాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకి ఓ పాప, బాబు ఉన్నారు.  వవన్ విడాకులు ఇచ్చిన తరువాత రేణూ దేశాయ్  కొడుకు అకిరానందన్, కూతురు ఆధ్యలతో కలిసి పూణెలో ఉంటుంది. అయితే పవన్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొడుకు కూతురుతో గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. గతంలో వీరి పుట్టిన రోజు వేడుకలకు పవన్ హాజరయ్యారు. ప్రస్తుతం  అకీరా  పవన్ తోనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య చరణ్ బర్త్ డేకి పవన్ చిరు ఇంటికి వెళ్లగా ఆ రోజు అకీరాని కూడా తీసుకొని వెళ్ళాడు. చరణ్ , పవన్ , చిరు, అకీరా, సురేఖ కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలను అకీరా బర్త్ డేకి చరణ్ రివీల్ చేశాడు. గత కొన్నిరోజుల నుండి రాజకీయ యాత్రతో బిజీగా ఉన్న పవన్ కంటి ఇన్ఫెక్షన్ కారణంగా యాత్రను వాయిదా వేశాడు. విజయవాడలో కంటికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. అయితే పవన్ ని ఓ హోటల్ రూం నుండి కారు దగ్గరకి తీసుకొచ్చే సమయంలో తన కుమారుడిని ఎత్తుకొని ఉన్న అన్నా లెజీనోవా, అకీరా కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా, విజయవాడలోని పడమట ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న పవన్, శుక్రవారం ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ భార్య అన్నా లెజినోవాతో పాటు  అకీరా కూడా పాల్గొన్నాడు.  పవన్ తన పెద్ద కుమారుడిని వెంట బెట్టుకుని గృహ ప్రవేశం చేయడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.