Home సినిమా పవన్‌కంటే ఎత్తుగా అకీరా!

పవన్‌కంటే ఎత్తుగా అకీరా!

Pk-Son

రెండు, మూడేళ్ల కిందటి వరకు కూడా తల్లి చాటు తనయుడిగా, పాల బుగ్గల పసివాడిగా కనిపించాడు పవన్‌కళ్యాణ్ తనయుడు అకీరానందన్. తల్లి రేణుదేశాయ్ దగ్గరే ఉంటున్న అకీరా అప్పుడప్పుడు హైదరాబాద్‌కి వచ్చి పవన్‌ను కలిసి పోతుంటాడు. అయితే ఈమధ్య అకీరా ఎదుగుదల అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తండ్రి పవన్‌కళ్యాణ్ కంటే ఎత్తు పెరిగి మొన్నటివరకు కనిపించిన అకీరానేనా అన్నట్టుగా మారిపోయాడు. ఈ విషయంపై తల్లి రేణుదేశాయ్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ… “అవును.. నాకంటే అకీరానే హైట్. నా ఎత్తు 5.8 అడుగులైతే, అకీరా 6.3 అడుగులు. 14 ఏళ్లకే అతను 6.3 అడుగుల ఎత్తు పెరిగాడు. తను ఎంత ఎత్తు ఎదిగినా నా బేబీనే”అని ఆమె చెప్పింది. ప్రస్తుతం రేణుదేశాయ్ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని రేణు స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా న్యూయార్క్‌లో దిగిన ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. ఇక పవన్ నుంచి విడిపోయిన రేణుదేశాయ్ మరో వివాహానికి సిద్ధమవుతోంది. ఇటీవలే రేణు నిశ్చితార్థ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఆమె వివాహం జరుగనుందని సమాచారం.