Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆ స్టార్లతో నటించాలనుంది

Payal

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన పంజాబీ అమ్మాయి పాయల్ రాజ్‌పుత్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఊహించని రీతిలో వసూళ్లను రాబడుతూ బ్లాక్‌బస్టర్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించడంలో హీరోయిన్ పాయల్ కూడా ముఖ్య పాత్రను పోషించింది. కేవలం గ్లామరస్‌గా కనిపించడమే కాదు అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది పాయల్. ఈ సినిమా తర్వాత ఆమెకు మీడియం రేంజ్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయట. అయితే తనకు సూపర్‌స్టార్లు మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్, ప్రభాస్‌లతో కలిసి నటించాలని ఉందని పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. భవిష్యత్తులో తప్పకుండా వారితో కలిసి నటించాలని కోరుకుంటున్నట్టు ఈ భామ చెప్పింది.

Comments

comments