Search
Sunday 18 November 2018
  • :
  • :

గ్యాస్‌లీకై ప్రమాదం జరిగితే బాధితులకు పరిహారం

Payment of cash on the basis of risk intensity

ప్రమాద తీవ్రత ఆధారంగా నగదు చెల్లింపు
డిస్ట్రిబ్యూటర్ల వద్దే దరఖాస్తులు
వంట గ్యాస్‌కు బీమా..!

మన తెలంగాణ/వనపర్తి : వంటగ్యాస్ ఇప్పుడు ప్రతి ఇంట్లో తప్పనిసరి. అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లతో గ్యాస్ ప్రమాదాలు జరుగుతుంటాయి. గ్యాస్ లీకై ప్రమాదం జరిగితే గ్యాస్ సంస్థలు బాధ్యత వహించి బీమా రూపంలో పరిహారం చెల్లిస్తాయి. గ్యాస్ వినియోగదారులకు ఆయా ఆయిల్ కంపెనీలు ప్రమాద బీమా సౌకర్యాన్ని పబ్లిక్ లైఫ్ ఇన్సురెన్స్ కింద కల్పిస్తున్నాయి. దీంట్లో థర్డ్ పార్టీ బీమా కూడా మిళితమై ఉంటుంది.

కావాల్సిన ధృవీకరణ పత్రాలు
ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే సంబంధిత అధికారి జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం, పోస్టు మార్టం నివేదిక, అగ్నిమాపక అధికారి నివేధిక ఉండా లి. గాచపడిన సందర్భంలో వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్నట్లు మెడికల్ షాపులో కొనుగోలు చేసిన మందుల బిల్లులు ఉండాలి. ఆసుపత్రిలో చికిత్స పొం దినట్లు వైద్యుడి ధృవీకరణ పత్రం .డిశ్చార్జి కార్డు ఇవ్వాలి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలితే తక్షణం కంపెనీ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇవ్వాలి. వారు ఆకంపెనీ సేల్స్ అధికారికి సమాచారం ఇస్తారు. సేల్స్ అధికారి స్థానిక ఇన్సురెన్స్ సర్వేయరర్ ,అగ్నిమాపక అధికారి వచ్చి పంచనామా చేస్తారు. అనంతరం ఇన్సురెన్స్ క్లైం చేస్తారు. ఇంటికి సంబంధించిన సిలిండర్ ఎక్కడ బుక్ చేసుకుంటారో ఆ డీలర్ నుండి బీమా క్లయిమ్ అవుతుంది.

పరిహారం ఇలా
గ్యాస్ లీకేజితో వ్యక్తి మృతి చెందితే రూ.6 లక్షలు, గాయపడితే రూ.25వేలు నుండి రూ.2లక్షల బీమా వర్తిస్తుంది. గృహోపకరణాలు, ఇల్లు, డ్యామేజ్ అయితే రూ.2లక్షల వరకు నష్టపరిహారం చెల్లిస్తారు. చుట్టు పక్కల వారికి ప్రమాదం వాటిల్లితే రూ.40 లక్షల వరకు బీమా వర్తిస్తుంది.

డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇవ్వాలి
సిలిండర్ పేలితే వినియోగదారుడు వెంటనే డిస్ట్రిబ్యూటర్‌కు సమాచారం ఇవ్వా లి. కంపెనీ బుక్ నెంబర్, రశీద్ నెంబర్, ప్రమాదం జరిగిన ఇంటి నెంబర్, బీమా కోరే దరఖాస్తుతో పాటు డిస్ట్రిబ్యూటర్ వద్ద ఉండే క్లయిమ్ ఫారం పూర్తి చేసి ఇవ్వాలి.

ఇలా అయితే వర్తించదు
సిలిండర్ బుక్ చేసుకున్న డోర్ ఇంటి నెంబర్ కాక మరో ఇంటి నెంబర్‌లో ప్రమా దం జరిగితే బీమా వర్తించదు. సిలిండర్ లీకైప్పుడు మాత్రమే భీమా క్లయిమ్ చేసుకుంటారు. ఉద్ధేశ్యపూర్వకంగా ప్రమాదం జరిగిందని వినియోగదారుడిపై అనుమానం వస్తే బీమా వర్తించదు.

Comments

comments