Search
Friday 21 September 2018
  • :
  • :

సిబిడిటి ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించుకోవచ్చు!

CBDTన్యూఢిల్లీ : ఆదాయం పన్ను విభాగం ఈ-మెయిల్స్ ద్వారా నోటీసులను పంపడం, వాటికి సమాధానం పొందడాన్ని వేగవంతం చేసింది. చిన్న కేసులకు కూడా ఐటి కార్యాలయాలను సందర్శించే పనిలేకుండా టాక్స్‌పేయర్లకు పన్ను లెక్కింపులను తెలియజేసేందుకు మార్పులు చేస్తోంది. ఐదు ప్రాంతాల్లో నాన్-కార్పొరేట్ చార్జీలను సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) గుర్తించింది. 100 ప్రాథమిక కేసులు ఈ-హియరింగ్ చేపట్టారు. టాక్స్‌పేయర్ల సేవల సామర్థాన్ని పెంచే ప్రక్రియలో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని సిబిడిటి పేర్కొంది. కాగితం రహిత పర్యావరణ హిత సేవలు చేపడుతున్నామని, ఇందుకు గాను ఈ-మెయిళ్లను విరివిగా వాడనున్నామని సంస్థ వెల్లడించింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి ఐదు నగరాల్లో నాన్-కార్పొరేట్ చార్జీలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు.

Comments

comments