Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పేటీఎం ద్వారా విదేశీ క‌రెన్సీ….

PTM

న్యూఢిల్లీ: పేటీఎం సంస్థ ఫారెక్స్ సేవలను బుధవారం ప్రారంభించింది. ఇండియాలో ఉన్న పెటిఎం వినియోగదారులు ఏ దేశానికి చెందిన కరెన్సీని అయిన పేటీఎం ద్వారా ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సందర్భంగా వినియోగదారులకు పేటీఎం ఫారెక్స్ కార్డు లేదా క్యాష్ ను అందిస్తోంది. ఇందుకు ముందుగా మొత్తం సొమ్ములో 2 శాతం చెల్లించి ఫారెక్స్ రేట్లను లాక్ చేసుకోవచ్చు. తర్వాత డెలివరీ సమయంలో మిగిలిన మొత్తాన్ని నెఫ్ట్ లేదా ఆర్‌టిజిఎస్ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవ నుంచి పేటీఎం 20 దేశాలకు చెందిన కరెన్సీని అందిస్తోంది. పేటీఎం అందించే ఫారెక్ట్ కార్డును ఏ దేశంలో అయినా ఎటిఎంలో వినియోగించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. లేదంటే మర్చంట్ లావాదేవీలు జరిపే సందర్భంలో స్వైప్ చేయవచ్చు. ఎటిఎంలో స్వైప్ చేసి అందులో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకునే అద్భుత ఫీచర్ ను ఇందులో పొందుపర్చింది. పేటీఎం ఫారెక్స్ సర్వీస్ నుంచి కస్టమర్లు సంవత్సరానికి 2.50 లక్షల డాలర్లను ఫారెక్స్ కార్డులోకి లోడ్ చేయవచ్చును. అలాగే 3వేల డాలర్లను కరెన్సీ నోట్ల రూపంలో పొందవచ్చును. పేటీఎం ఫారెక్స్ సర్వీస్ వెబ్, ఆండ్రాయిడ్, ఐఒఎస్ ప్లాట్‌ఫాంలపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Comments

comments