Search
Sunday 23 September 2018
  • :
  • :

80 శాతానికి పెరిగిన పేటీఎం నష్టాలు

Paytm losses rise by almost 80%

న్యూఢిల్లీ: వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన డిజిటల్ వ్యాలె ట్ పేటీఎం ఈసారి భారీ నష్టాలు వచ్చాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టాలు 80 శాతం మేర పెరిగి రూ.1600 కోట్లగా నమోదయ్యాయి. కంపెనీ తన పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం మాల్, కొత్త మ్యూచువల్ ఫండ్ బిజినెస్, పేటీఎం మనీ పేరిట విస్తరణ కార్యక్రమాలు చేపట్టడంతో సంస్థకు నష్టాలు చుట్టుముట్టాయి. ఈ విస్తరణతో నష్టాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. నష్టాల కారణంగా కంపెనీ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ శేఖర్ శర్మ వార్షిక వేతనం 2017-18 ఆర్థిక సంవత్సరం రూ.3 కోట్లకు తగ్గింది. 2016-17లో ఆయన వేతనం రూ.3.47 కోట్లగా ఉంది. ఉద్యోగులకు సంబంధించిన ఖర్చులు కూడా 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.625 కోట్లకు పెరిగినట్టు కంపెనీ తన వార్షిక రిపోర్టులో పేర్కొంది. ఇటీవలే మార్కెట్ మాంత్రికుడు వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే పేటీఎంలో రూ.356 మిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కంపెనీ రూ.7600 కోట్ల రిజర్వును, మిగులును కలిగి ఉంది. ఈ ఏడాది ఫిన్‌టెక్ ప్రొడక్ట్‌లపై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు శర్మ చెప్పారు

Comments

comments