Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

వినియోగదారులకు పేటీఎం షాక్

PAYTM

తన వినియోగదారులకు పేటీఎం షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వాలెట్‌లో డబ్బు వేస్తే ఇకపై రెండు శాతం చార్జీ వసూలు చేయాలని పేటిఎం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. పేటీఎం దుర్వినియోగం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం తమ అధికారిక బ్లాగు ద్వారా వెల్లడించింది. ఇప్పటి వరకు చాలా మంది క్రెడిట్ కార్డు వాడి పేటీఎం రీఛార్జి చేసి, వాటిని బ్యాంక్ ఖాతాలకు జమ చేసేవారు. ఈ క్రమంలో ట్రాన్సాక్షన్ కాస్ట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే ఛార్జీలు వసూలు చేయాలని పేటీఎం నిర్ణయించినట్లు సమాచారం. అయితే నెట్‌బ్యాంకింగ్ , డెబిట్ కార్డులతో రీఛార్జి చేస్తే ఎటువంటి ఛార్జీలు వసూలు చేయదు. క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌లకు , ఇష్యూ చేసే బ్యాంకులకు పేటీఎం చెల్లించాల్సి రావడంతో  పేటీఎం ఈ  నిర్ణయం తీసుకుంది.

Comments

comments