Home హైదరాబాద్ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు

కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు

PCB officials who have inspected the industry

పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టిన పీసీబీ అధికారులు
మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకే…

మన తెలంగాణ/సిటీబ్యూరో: వాయు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి పి.సత్యనారాయణరెడ్డి హె చ్చరించారు. బుధవారం నాచారం, మల్లాపూర్‌లోని పారిశ్రామిక వాడలోని ఇంటోనేషన్ రీసెర్చ్ ల్యాబ్, క్లియర్ సింత్, శ్రీని ల్యాబ్స్, జీ.ఆర్.కె ల్యాబ్స్, వాగ్దేవి ఇన్నోసైన్స్, జీవీకే బయో మల్లాపూర్, జీవీకే బయో నాచారం, ఇన్నోజెంట్ ల్యాబ్స్ పరిశ్రమలను మండలి అధికారులు తనిఖీ నిర్వహించారు. జీవీకే బయో, ఇన్నోజెంట్ ల్యాబ్స్ పరిశ్రమలను మండలి సభ్య కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి స్వయంగా సందర్శించి అక్కడి వాయు కాలుష్య నియంత్రణ పరికరాల పనితీరును పరిశీలించారు. నాచారం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఫా ర్మా కంపెనీల ద్వారా వెలువడే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు చ ర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కి ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ మేరకు తనిఖీలు చే పట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక ఏడు బృందాలను ఏర్పాటు చేసి వా యు కాలుష్యానికి సంబంధించి శాంపిల్స్‌ను సేకరించి ఎనాలిసిస్ చే స్తున్నట్లు తెలిపారు. వచ్చిన నివేదికల ఆధారంగా మండలి నిబంధనలను ఉల్లంఘించిన పరిశ్రమలను టాస్క్‌ఫోర్స్ కమిటీ ముందు హియరింగ్ పిలిచి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.